జేఏసీ నిర్ణయం ..ఇక నుండి తెలంగాణాలోనూ

JAC Protest In Telangana Over AP Capital

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని జేఏసీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ రాజధానిగా డిమాండ్ చేస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ ఇకపై ఆందోళనను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. ఇకపై అమరావతి రాజధాని ఆందోళనను 13 జిల్లాలకు జాక్ కార్యక్రమాలు విస్తరించాలని తీర్మానించారు. హైదరాబాద్‌లో కూడా జాక్ ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేశారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలతో పాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోను అమరావతి ఆందోళన కొనసాగించాలని జేఏసీ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం శనివారం భేటీ అయ్యింది. వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.అమరావతి జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలను ప్రతినిధులు వెల్లడించారు. ఆందోళనతో చనిపోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వారు స్పందించేలా చేయాలని తలపెట్టారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా పోలీసులు చేసే డ్రోన్ ఆపరేషన్ నిలుపుదలచేయాలని డిమాండ్ చేస్తోంది అమరావతి జేఏసీ .

JAC Protest In Telangana Over AP Capital,amaravati JAC , Capital amaravati , andhra pradesh, telangana , hyderabad , protests , round table meet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *