వారానికోసారి కలిసి కాఫీ తాగండి

JAGAN COFFEE STORY

ప్రభుత్వంలో కీలక పాత్ర అధికారుల మధ్య సమన్వయం పెంపొందించడానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త చిట్కా తెరపైకి తీసుకొచ్చారు. ఓ కప్పు కాఫీతో అధికారులను కలపాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడంలోనూ అధికారుల పాత్రే కీలకం. వారు సరిగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఒకవేళ వారు సరిగా పనిచేయకపోయినా, సమస్యల పరిష్కారంలో విపలమైనా నష్టం మాత్రం అంతిమంగా ప్రభుత్వానికే. ఈ నేపథ్యంలో వివిధ శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల పలు సమస్యలు పరిష్కారం కావడంలేదని గుర్తించిన జగన్.. అందుకు ఓ ఉపాయం ఆలోచించారు. ముఖ్యంగా భూ వివాదాల పరిష్కరానికి కాఫీ సూత్రం పనిచేస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్ కార్యక్రమంలో కలవాలని సూచించారు. ఏదో మొక్కుబడిగా కలిసి, కాఫీ తాగి వెళ్లిపోకుండా.. భూ వివాదాలకు సంబంధించిన జాబితాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవాలని సూచించారు. బుధవారం ఆ జాబితాలతో సంబంధిత తహశీల్దార్లు, ఎస్ఐలు, ఆర్ఐలు, వీఆర్వోలు కలిసి కూర్చుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. మరి ఈ కాఫీ సూత్రం ఎంతవరకు విజయవంతమం అవుతుందో చూడాలి.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *