జగన్ నిర్ణయం తెలుగోళ్ల కొంప ముంచుతుందా?

Spread the love

JAGAN DECISION IMPACT KARNATAKA TELUGU PEOPLE

ఏపీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రజలకే తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయం ఒక్క ఏపీ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద చిచ్చు పెట్టేలా ఉందని తెలుస్తుంది. ఎప్పుడైతే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ బడ్జెట్ సమావేశాలలో స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చట్టం చేశారో అప్పుడే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక ఇదే నిర్ణయం ఇతర రాష్ట్రాల వాళ్లు తీసుకుంటే బెంగుళూరు, చెన్నై, పూణే, కలకత్తా వంటి మహానగరాల్లో మనవాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న ప్రశ్న అప్పుడే ఉత్పన్నమైంది. ప్రతిపక్ష పార్టీలు జగన్ తీసుకున్న నిర్ణయ ప్రభావం భవిష్యత్తులో ఉంటుందని తేల్చి చెప్పాయి. ఇక కేంద్ర సర్కార్ కూడా జగన్ తీసుకొన్ననిర్ణయం పైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఏపీలో నిరుద్యోగులు ఎక్కువగా ఉందని, అందుకోసం నిరుద్యోగం తగ్గించాలని భావించిన జగన్ ప్రభుత్వం స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇక్కడి ఉద్యోగాలకు స్థానికులు అర్హులని, రాష్ట్ర ప్రజలే రాష్ట్రంలో ఉద్యోగాలకు చెయ్యాలని ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వకూడదని జగన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు పెను చిచ్చు రేపుతోంది. ఇక జగన్ తీసుకున్న తరహా నిర్ణయమే కర్ణాటక కర్ణాటక సీఎం ఎవరో కూడా తీసుకున్నారు. దీనితో అక్కడ కర్ణాటక ఉద్యోగాలు కన్నడిగులకే చెందాలని ఆయన ట్వీట్ చేశారు. దీనికి అనుగుణంగా తాము చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రజాభిప్రాయం కూడా ఇదేనని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ మేం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన యడ్యూరప్ప ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు పోతామని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన యడియూరప్ప.. కర్ణాటకలోని ఉద్యోగాలు కన్నడిగులకే అనే హ్యాష్ ట్యాగ్ ను తన ట్వీట్ కు జత చేశారు. ఇక స్థానికులకే ఉద్యోగాల కోసం ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగే ఆలోచనలో ఉన్నారు. ఇక వీరికి మద్దతుగా ప్రముఖ సినీ నటుడు ఉపేంద్ర ఈ ఆగష్టు నెల 14,15 తారీఖుల్లో జరగబోయే ఉద్యమంలో పాలుపంచుకోనున్నారు .ఇప్పటికే ఈ ఉద్యమానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఒకవేళ ఇదే కానీ జరిగితే తమ పరిస్థితి ఏంటి అని బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తమ కొంప ముంచేలా ఉందని వారు లబోదిబోమంటున్నారని సమాచారం.

TOMATO RATE IN PAK INCREASE

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *