ఏపీలో నారాయణ స్కూల్ సీజ్ చేసిన జగన్ సర్కార్

Spread the love

Jagan Government Seized Narayana Schools

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది ఏపీలో పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అని గొప్పలు చెప్పుకుంటున్న విద్యా సంస్థల పరిస్థితి .. కొన్ని ప్రైవేటు స్కూళ్లకు ఉండే పేరుకు.. వారు అనుసరించే విధానాలకు అస్సలు పొంతనే ఉండదు. ఈ రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. చిన్నారులు బడిబాట పట్టారు . ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ గుర్తింపు లేని స్కూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.అనుమతులు లేని స్కూళ్లను మూసివేయటమే తప్పించి.. ఊరుకునేది లేదన్నట్లుగా ఉన్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే బెజవాడలోని నారాయణ స్కూల్ ను సీజ్ చేసింది. గుర్తింపు లేని ఈ స్కూళ్ల యాజమాన్యానికి ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చిన అధికారులు.. వారి తీరు మార్చుకోకపోవటంతో సీజ్ చేసి.. లక్ష రూపాయిల జరిమానా విధించారు. సత్యనారయనపురంలోని నారాయణ స్కూల్ ను సీజ్ చేసిన అధికారులు అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొంది .
ప్రైవేటు కాలేజీలు.. స్కూళ్లకు సంబంధించి ఫీజుల నియంత్రణకు కమిషన్ వేయటంతో పాటు అర్హులైన పేదలందరికి అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే హామీ ఇవ్వటం తెలిసిందే. ఈ మేరకు తొలి కేబినెట్ సమావేశంలోనే విద్యాశాఖ సంస్కరణలపై రెగ్యులరేటరి కమిషన్ ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మాటలే కాదు చేతల్లోనూ స్పీడే అన్న విషయం తాజా ఉదంతంతో రుజువైనట్లుగా చెప్పక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *