జగన్ ది సైకో పాలన..

JAGAN PSYCHO RULE

ఏపీలో టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన సైకో పాలనలా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఏకంగా చంద్రబాబు బిన్ లాడెన్ అంటూ వైసీపీ సోషల్ మీడియాకు చెందిన ఒకరు పోస్ట్ చేశారు.

జగన్ పాలన గురించి మాట్లాడుతూ చంద్రబాబు  అభివృద్ధిని ఆపేసి జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని జాతీయ మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంతోనే మేము సక్సెస్ అయ్యామని చంద్రబాబు చెప్పారు. ఆత్మకూరు దాడులపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యకర్తల్లో మనో ధైర్యం నింపుతామన్నారు. టీడీపీ నేతలంతా ప్రభుత్వంపై ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తున్నారని అన్నారు.

ఇక  టీడీపీ అధినేత చంద్రబాబుని వైసీపీ సోషల్ మీడియాకు చెందిన ఒకరు బిన్ లాడెన్‌లా ఫోటో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఇక దీనిపై  ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని మీద ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టిన లోకేష్..  జగన్‌మోహన్‌రెడ్డిని సంభోదిస్తూ.. అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వున్నట్టా లేనట్టా..? మీ గుడ్డి సర్కారు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనబడ్డం లేదా ? ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్లపై చర్యలు తీసుకునేందుకు చేతులు రావట్లేదా..? అంటూ నిలదీశారు. మీ చట్టాలన్నీ టీడీపీ వాళ్ల మీద కేసులు పెట్టడానికేనా.. అంటూ దుయ్యబట్టారు. మొత్తానికి బాబు జగన్ ను సైకో అంటే , వైసీపీ ఏకంగా లాడెన్ అని మార్ఫింగ్ ఫోటోనే పెట్టిందని తెలుస్తుంది.

AP POLITICS

tags : ap , jagan , chandrababu, tdp, ycp, psycho, bin laden

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *