బోటు ప్రమాదంపై జగన్ సీరియస్

Jagan Serious On Boat Accident

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై అధికారులు, తూ.గో.జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మాట్లాడారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లను సహాయ చర్యల్లో వాడాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. బోటు ప్రమాద ఘటనలపై సీఎం సీరియస్‌ అయ్యారు. తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్‌ చేయాలన్నారు. ప్రయాణానికి ఆ బోట్లు అనుకూలమా? కాదా? అన్నదానిపై క్షణ్నంగా తనిఖీ చేయాలన్నారు. లైసెన్స్‌లు పరిశీలించాలని , బోట్లను నడిపేవారు, అందులో పనిచేస్తున్నవారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా తనిఖీ చేయాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు బోట్లలో ఉన్నాయా? లేదా? పరిశీలించాలన్న సీఎం, నిపుణులతో పటిష్టమైన మార్గదర్శకాలు తయారుచేసి తనకు నివేదించాలన్నారు.

Ap Cm YsJagan

Related posts:

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ రేప్ కేస్...
టిక్ టాక్ లో వీడియో చేసి....
నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రియాంక రెడ్డి హత్య..షాద్‌నగర్ లో ఉద్రిక్తత
బ్రేకింగ్ న్యూస్.. అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం
ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను కోర్టుకు...
తిరుమల కొండపై ప్రైవేట్ హోమం
ప్రియాంకా రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్
ప్రియాంక కేసులో నిందితులు వీరే...మంత్రి తలసాని పరామర్శ
ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా
ఆర్టీసీ కార్మికులను చేర్చుకుంటాం: కేసీఆర్
ప్రియాంక స్కూటీ పంచర్ చేశారా? వారి పనేనా?
ప్రియాంక రెడ్డి హత్య కేసులో 15 బృందాలతో గాలింపు
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి సజీవ దహనం
జార్జ్‌ చనిపోవడానికి ముందు ఎం జరిగిందంటే...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *