కేసీఆర్ బాటలో జగన్.. ఏ విషయంలో తెలుసా?

Jagan Starts KANTIVELUGU Scheme

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కేసీఆర్ బాటలో నడుస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న కంటి వెలుగు పథకాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న  వైసీపీ ప్రభుత్వం  రేపటి నుండి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు.  ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈనెల 10న సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

వరల్డ్ సైట్ డే సందర్భంగా.. అనంతపురంలోని ఓ జూనియర్ కాలేజీలో ఈ కార్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజలందరికీ వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయనున్నారు. మొత్తం 5 దశల్లో మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రెండు దశల్లో విద్యార్థులకు కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తారు. మిగిలిన మూడు దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం జిల్లాల ఆధారంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక కంటి వెలుగు సంబంధించిన పరికరాలు, సామాగ్రి, మందుల్ని సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తానికి  సీఎం కేసీఆర్ బాటలో,  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి  తీసుకున్న  ఈ నిర్ణయం ఏపీ ప్రజల కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుందని  భావిస్తున్నారు.

tags: ap kanti velugu, ys jagan, jaganmohan reddy, ycp, trs, kcr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *