మోడీకి పాదాభివందనం చేయాలని యత్నించిన జగన్

Spread the love

JAGAN TO BOW In front OF MODI

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి పాదాభివందనం చేయబోయారు. ఏపీ సీఎం చేసిన పనిపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది.

ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా విమానం నుంచి కిందకి దిగి వస్తున్న మోడీకి జగన్ గులాబీతో స్వాగతం పలికారు. ప్రధానిని చూడగానే సీఎం నడుం వంచేశారు. ఒకసారి కాదు రెండు సార్లే జగన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా.. ప్రధాని వాద్దని వారించారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉండి..ప్ర‌ధానికి అంత‌లా వంగి..వంగి దండాలు పెట్టాల్సిన అవ‌స‌రం ఉందా. గ‌తంలో చంద్రబాబు ఇదే త‌ర‌హాలో చేస్తే ఎంతో మంది విమ‌ర్శించారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ తిరిగి అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే స‌మ‌యంలో వైసీపీ రివ‌ర్స్ ఎటాక్ మొద‌లు పెట్టింది.

జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిలో గ‌తం కంటే ఎంతో మార్పు. జ‌గ‌న్‌కు అస‌లు పెద్ద‌లంటే లెక్కే లేదు..క‌నీసం గౌర‌వించ‌రు. ఇదీ ప‌దే ప‌దే టీడీపీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌లు. కానీ, కొంత కాలంగా జ‌గ‌న్ శైలిలో ఊహించ‌ని మార్పు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో నాడు ఎన్డీఏ ప్ర‌తిపాదించిన రాష్ట్రప‌తి అభ్య‌ర్ది రామ్‌నాద్ కోవింద్ హైద‌రాబాద్ వ‌చ్చారు. అప్ప‌టికే వైసీపీ త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఆ స‌మ‌యంలో రామ‌న్‌నాధ్ కోవింద్‌కు జ‌గ‌న్ పాదాభివంద‌నం చేసారు. దీని పైన టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసింది. ఇక‌, ఆ త‌రువాత చిన్న జీయ‌ర్ స్వామి.. స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి స్వామి వంటి వారికి సాష్టాంగ న‌మ‌స్కారాలు చేసారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌ధాని మోదీ రెండో సారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తిరుప‌తికి వ‌చ్చారు. జ‌గ‌న్ సైతం ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మోదీ ఏపీకీ రావ‌టం మొద‌టి సారి. అయితే, స్వాగ‌త స‌మ‌యంలో జ‌గ‌న్ వంగి..వంగి మోదీకి న‌మ‌స్కారాలు చేసారు. పాదాభివంద‌నం కోసం ప్ర‌య‌త్నించ‌గా..మోదీ వారించారు. భుజం త‌ట్టి అభినందించారు.

ముఖ్య‌మంత్రి హోదా ఉన్న జ‌గ‌న్ త‌న కంటే వ‌య‌సులో పెద్ద వార‌నే కార‌ణంగానే మోదీకి పాదాభివంద‌నం చేయాల ని భావించార‌ని..అంతే హుందాగా మోదీ సైతం వారించార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంతో ఎలా వ్య‌వ‌హ‌రించ‌బోయేదీ ఢిల్లీ మీడియా సమావేశంలోనే స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉండి సాధించుకోవ‌టం మిన‌హా..వారికి ఎవ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేద‌ని..వారితో స‌ఖ్య‌త‌గా ఉండం.. బ్ర‌తిమిలాడి ప్ర‌యోజ‌నాలు ద‌క్కించుకోవ‌టం మిన‌హా మ‌రో దారి లేద‌ని స్ప‌ష్టం చేసారు. ఇక‌, ఆత్మౌగౌర‌వం దెబ్బ‌తీస్తే తాను ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారో సోనియా విష‌యంతో జ‌గ‌న్ తీరును గుర్తు చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ సుదీర్ఘ కాలం ముఖ్య‌మం త్రిగా ఉండాల‌ని భావిస్తున్నార‌ని..అందులో భాగంగానే…కేంద్ర సాయం కీల‌కం కావ‌టంతో..ప్ర‌ధానికి మ‌రింత గౌర‌వం ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వివ‌రిస్తున్నారు. దీనికి స్పంద‌న‌గానే ప్ర‌ధాని సైతం పార్టీ స‌మావేశంలో..ద‌ర్శ‌న స‌మ‌యంలో జ‌గ‌న్‌కు ప్రాధాన్య‌త ఇచ్చిన విష‌యాన్ని వివ‌రిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *