అమ్మ ఒడి టార్గెట్ గా జగన్ పై లోకేష్ సెటైర్లు  

JAGAN TARGETED BY LOKESH BY AMMAVODI

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి  నారా లోకేష్ సెటైర్లు వేశారు .  వైసిపి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని అందిస్తుంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న  పాఠశాలల, కళాశాలల విద్యార్థులందరికీ  అమ్మఒడి పథకం అందిస్తామని చెప్పి మాట మార్చారని మండిపడ్డారు. ఇది మాటల ప్రభుత్వమే కానే చేతల ప్రభుత్వం కాదని ఆయన మండిపడ్డారు. అమ్మ ఒడి పథకాన్ని  ఆంక్షల  బడి పథకంగా మార్చారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్విట్టర్‌ వేదికగా రోజుకో అంశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న  లోకేష్ తాజాగా  అమ్మ ఒడి పథకం  విషయంలో  జగన్ మాట మార్చిన తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు.  అసెంబ్లీ సాక్షిగా అమ్మ ఒడి విషయంలో మాట తప్పారు, మడమ తిప్పారు అంటూ  ఎద్దేవా చేశారు. 

ఎన్నికల సభల్లోనూ, పాదయాత్రలోనూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి స్కూల్ కి వెళ్లే ప్రతి బిడ్డకి రూ.15 వేలు సాయం  చేస్తామని  చెప్పిన  జగన్మోహన్ రెడ్డి  వైసిపి అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి అనగానే తడబడటం ప్రారంభించారు అంటూ ట్వీట్ చేసి  అమ్మఒడి పథకం పై సర్కారు తీరును  తెలియజేశారు.  అమ్మఒడి పథకం పై వరుస ట్వీట్లు చేసిన నారా లోకేష్  అమ్మ ఒడి పథకం గురించి  రోజుకో రకమైన ప్రకటనలు చేశారని , ప్రకటనల ఆరాటమే తప్ప  విద్యార్థులకు జరిగిన మేలు ఏమీ లేదని మండిపడ్డారు.
మొదట ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో చదివేవారికి లేదని మంత్రి ప్రకటించారు. ఆ తరువాత ఎక్కడ, ఏ స్కూలైనా అమ్మ ఒడి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
అసెంబ్లీకి వచ్చేసరికి తెల్లకార్డు ఉన్నవారికే అని  ప్రకటించారని  నారా లోకేష్ వైసిపి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పిల్లల్లో ఒకరికే అని  చెప్పి అమ్మ ఒడిని కాస్తా ‘ఆంక్షల బడి’ చేశారన్నారు . జగన్ గారి హామీల ప్రకారం రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే సుమారు 80 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాలి. పథకం అందించాలి కానీ అసెంబ్లీకి వచ్చేసరికి బోలెడు షరతులు పెట్టి లబ్దిదారులను 43 లక్షలు.. అంటే సగానికి సగం చేశారని  పేర్కొన్నారు మాటలు ఘనం, కోతలు సగం.. ఇదీ జగన్ గారి హామీల తీరు అంటూ   వైసిపి ప్రభుత్వ వైఖరిని  ఎండగట్టారు.

POLITICAL NEWS UPDATES

Related posts:

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ రేప్ కేస్...
టిక్ టాక్ లో వీడియో చేసి....
నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రియాంక రెడ్డి హత్య..షాద్‌నగర్ లో ఉద్రిక్తత
బ్రేకింగ్ న్యూస్.. అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం
ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను కోర్టుకు...
తిరుమల కొండపై ప్రైవేట్ హోమం
ప్రియాంకా రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్
ప్రియాంక కేసులో నిందితులు వీరే...మంత్రి తలసాని పరామర్శ
ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా
ఆర్టీసీ కార్మికులను చేర్చుకుంటాం: కేసీఆర్
ప్రియాంక స్కూటీ పంచర్ చేశారా? వారి పనేనా?
ప్రియాంక రెడ్డి హత్య కేసులో 15 బృందాలతో గాలింపు
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి సజీవ దహనం
జార్జ్‌ చనిపోవడానికి ముందు ఎం జరిగిందంటే...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *