పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించిన జగన్

Spread the love

Jagan warns  MLA’s

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారం చేపట్టిన నాటి నుండి పారదర్శకమైన, అవినీతి రహిత పాలన తమ ధ్యేయమని చెప్తున్నారు. వైసీపీ పై ఎంతో నమ్మకంతో అధికారం లోకి తీసుకుని వచ్చిన ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని నిర్ణయించారు. ఇక ఈ నేపధ్యంలోనే ప్రజా వేదికలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు జగన్.
అవినీతికి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. దోపిడీకి తెగబడితే నష్టం జరిగేది మీకే అంటూ హెచ్చరించారు.

ఇక అలా చేసిన ఎవరికైనా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని స్పష్టం చేశారు .తప్పు చేసిన వారు ఎంత పెద్ద వారైనా, ఏ స్థాయిలో ఉన్నవారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని అలా కాకుండా స్వప్రయోజనాల కోసం చూసుకుంటే దెబ్బతింటాడని పేర్కొన్నారు. ఎంతో విశ్వాసంతో ప్రజలు ఎన్నుకున్నందుకు వారి సమస్యల పరిష్కారం కోసం, వైసిపి మేనిఫెస్టో అమలు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక వైసిపి మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించాలని ఆయన అన్నారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ జగన్ ఎమ్మెల్యేలకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇక అధికారులు సైతం అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. అక్రమాలకు తెర తీశారు. దీంతో అటు పాలకుల, అధికారుల దోపిడీని భరించలేక ప్రజలు గత ఎన్నికల్లో టిడిపిని చావుదెబ్బ కొట్టి వైసీపీకి అఖండ విజయాన్ని అందించారు. గత పాలకులు చేసిన తప్పులకే ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చారని భావించిన జగన్ ఇక తమ పాలనలో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొదటి నుండి పార్టీలోని మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించమని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *