జగన్ సీఎం అయితే ఆ సంచలన నిర్ణయం

Spread the love

JAGAN WILL BE AP CHIEF MINISTER

ఏపీ రాజకీయాల్లో మే 23 న రానున్న ఫలితాలు వైసీపీ కి అనుకూలంగా ఉంటె జగన్ సీఎం అయితే ఆయన సంచలన నిర్ణయం తీసుకుంటారని ఏపీలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రాబోతున్న ఫలితాలకు సంబంధించి ఒక 10 సర్వేలు బయటకు వస్తే వాటిలో ఖచ్చితంగా 8 సర్వేలు వైసీపీ పార్టీదే విజయం అని తేల్చి చెప్పేస్తున్నాయి.గరిష్టంగా జగన్ ఈసారి ఖచ్చితంగా 100 సీట్లు గెలుపొందుతారని సగటున ప్రతీ ఒక్క సర్వేలో తేలుతుంది.దీనితో ఇక ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగనే అని వైసీపీ శ్రేణులు అంతా బలంగా ఫిక్స్ అయ్యిపోయారు.దీనితో జగన్ మే 23 న రాబోయే ఫలితాల అనంతరం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న వార్త రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.

అలాగే ఆర్టీసీ కూడా విపరీతమైన నష్టాల్లో నడుస్తుంది.దీనితో రాష్ట్రానికి వచ్చిన ప్రతీ రూపాయి కూడా వృధాగా పోకూడదు అని జగన్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.అందుకోసమే జగన్ ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యినట్టైతే తన జీతం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటానని మిగతా లక్ష 59 వేల రూపాయల చిల్లర మొత్తం ఏపీ కోసమే వినియోగిస్తారని తెలుస్తుంది.జగన్ తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం పై జగన్ క్యాడర్ కూడా జగన్ లాగానే వారి వేతనాలు కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించాలనే భావనలో ఉన్నారట.ఒకవేళ జగన్ కనుక ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే నిజంగా అది ఒక సరికొత్త రాజకీయానికి నాంధి పలికారని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *