సీబీఐ కోర్టుకు హాజరు కాని జగన్

JaganMohanaReddy Not Attending CBI Court

నేడు కూడా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కాలేదు. ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ న్యాయస్థానానికి హాజరు కావాల్సిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసును ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 11 ఛార్జిషీట్ల పై విచారణ జరిగింది. గతవారం కూడా కోర్టుకు హాజరు కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, నేడు సైతం సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కాలేదు. ఈ రోజు విచారణకు ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ హాజరయ్యారు. జగన్, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులెవరూ ఈనాటి విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపును ఇవ్వడం కుదరదని కచ్చితంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు 15 రోజుల క్రితం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, అధికారిక పర్యటనల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో జగన్ విచారణకు హాజరు కాలేరంటూ ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

tags : andhra pradesh,cm jagan, jagan mohan reddy, cbi special court, attendance, busy schedule

ఆర్టీసీ కార్మిక సమ్మె యథాతథం అన్న అశ్వత్థామరెడ్డి

భాష లేనిదే తెలంగాణ ఉద్యమం జరిగిందా… పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *