పార్టీ మార్పు కాలమే నిర్ణయిస్తుందన్న జగ్గారెడ్డి

Jagareddy said party range may depend up on time

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార టీఆఎస్ పార్టీలోకి భారీగా వలసలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి పార్టీల నుండి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కూడా వున్నారు. పార్టీ మారనున్నట్లు గత మూడు రోజులుగా విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు.
తాను పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకుండా దాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి ఈ ప్రచారంపై స్పందించడం, వాటిని ఖండించడం చేస్తున్నానని….కానీ వాటికి ఎలాంటి విలువ లేకుండా పోతోందని అన్నారు. టీఆర్ఎస్ లోకి వెళతానో, లేదో కాలమే నిర్ణయిస్తుందని… అంతవరకు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని జగ్గారెడ్డి సూచించారు. తన పోరాటం టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై కాదని…గతంలో తమ జిల్లాకు అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావుపైనే అని వెల్లడించారు. ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయిన సంగారెడ్డి ప్రజల పక్షాన తాను మాట్లాడుతున్నానని అన్నారు. ప్రస్తుతం వేసవి సందర్భంగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందని…దీనికి హరీషే కారణమని జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. మొత్తానికి జగ్గారెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల అర్ధం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *