గౌరు చరితారెడ్డి కి షాక్ ఇచ్చిన జగన్

 JAGUN SHOCK FOR GOURI CHARITHA REDDY… కాటసానికి టికెట్ ?

ఏపీలో ఎన్నికల సమీపిస్తుంటే రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల కోసం రాజకీయ పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. టికెట్ తమకే వస్తుందని ఆశాభావంతో ఇంత కాలం పని చేసిన నేతలు తమకు టిక్కెట్ రాదని తెలియడంతో దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు. వైసీపీలో గౌరు చరితారెడ్డి కి ఊహించిన షాక్ తగిలింది. పాణ్యం వైసీపీ టికెట్ తనదేనంటూ కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ప్రకటించుకుంటున్నారు. కాటసాని.. ఇటీవల బీజేపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. నాలుగు దఫాలుగా పాణ్యం లో రామ్ భూపాల్ రెడ్డి విజయ ఢంకా మోగిస్తూ వస్తున్నారు. దీంతో.. ఈసారి కూడా విజయం తనదేననే ధీమాతో ఉన్నారు కాటసాని.ఇదే విషయంపై కాటసాని తాజాగా మీడియాతో మాట్లడారు. పాణ్యం టికెట్ జగన్.. తనకే ఇస్తానని మాట ఇచ్చారని చెప్పారు. తన టికెట్ విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా.. కాటసాని ప్రకటనతో దివంగత నేత వైఎస్ కి సన్నిహితురాలైన గౌరు చరితారెడ్డి రాజకీయ భవిష్యత్తు డోలాయమానంగా తయారైంది.

For More Click Here

More Latest Interesting news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *