రాధికా, శ‌ర‌త్ కుమార్‌ల‌కు ఏడాది జైలు

34
Jail To Sarath Kumar and Radhika
Jail To Sarath Kumar and Radhika

Jail To Sarath Kumar and Radhika

చెక్ బౌన్స్ కేసులో శ‌ర‌త్ కుమార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్ ల‌కు చెన్నై స్పెష‌ల్ కోర్టు ఏడాది జైలు శిక్ష‌ను విధించింది. ఈ కోర్టు బుధ‌వారం ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారించింది. ఈ మేర‌కు 2018లో జ‌రిగిన చెక్ బౌన్సు కేసులో ఇరువురికి జైలు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. రాడాన్స్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు శ‌ర‌త్ కుమార్‌, రాధికా, లిస్టిన్ స్టీఫెన్లు క‌లిసి భాగ‌స్వామ్యులుగా ఉన్న మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థ‌కు కోటిన్న‌ర ఫైనాన్స్ ఇచ్చింది. ఇందుకు గాను రెండు చెక్కుల‌ను తీసుకున్న‌ది. మ‌రోవైపు శ‌ర‌త్ రేడియ‌న్స్ మీడియా వ‌ద్ద రూ.50 ల‌క్ష‌ల చేబ‌దులు కూడా తీసుకున్నాడు. ఇందుకు ఐదు చెక్కులిచ్చారు. అయితే, ఈ చెక్కుల్ని బ్యాంకులో స‌మ‌ర్పించ‌గా అవి బౌన్స్ అయ్యాయి. అయితే, అంత‌కంటే ముందు ఇరువురు సైదాపేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు త‌మ ‌మీద న‌మోదైన క్రిమిన‌ల్ ప్రొసీడింగ్స్ కు వ్య‌తిరేకంగా హైకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. అయితే హైకోర్టు కేసును ఆరు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని ఆదేశించింది. ఈ క్ర‌మంలో కేసును ఎంపీ, ఎమ్మెల్యే స్పెష‌ల్ కోర్టుకు బ‌దిలీ అయ్యింది. బుధవారం కేసు హియ‌రింగ్ కు రాగా జ‌డ్జీ ఎన్ అలీసియా వాద‌న‌ల్ని విన్న త‌ర్వాత ఇరువురికి ఏడాది పాటు జైలు శిక్ష‌ను విధించారు.

 

Tamil Movies Latest News