మా పార్టీలోకి రండి

JANASENA INVITES SPY REDDY

  • ఎస్పీవై రెడ్డికి జనసేన ఆహ్వానం
  • తమ పార్టీ నుంచి పోటీచేయాలని వినతి

టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ వీడిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి జనసేన స్నేహహస్తం అందించింది. తమ పార్టీలో చేరి పోటీ చేయాలంటూ విన్నవించింది. తన కుటుంబానికి టికెట్ ఇస్తానని తొలుత మాట ఇచ్చి, తమలో ఆశలు పెంచిన చంద్రబాబు చివరకు మొండిచేయి చూపించారని ఎస్పీవై రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీక గుడ్ బై చెప్పిన ఆయన.. తాము స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నట్టు చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు. గురువారం నామినేషన్‌ దాఖలు చేయబోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన ఎస్పీవై రెడ్డిని తమ పార్టీలో చేరాలని ఆహ్వానించింది. ఇండిపెండెంట్ గా పోటీ చేయకుండా జనసేన నుంచ బరిలోకి దిగాలని కోరింది. ఈ అంశంపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. అవి సఫలమైతే జనసేన నుంచి ఎస్పీవై రెడ్డి కుటుంబం పోటీ చేయడం ఖాయమే. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *