జనసేన పార్టీ బీజేపీలో విలీనం?

Janasena Party Merge Into BJP?

అన్నయ్య చిరంజీవి బాటలో పవన్?
పవన్ కళ్యాణ్ వింత వైఖరి వెనుక రహస్యం ఏంటి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి ఆసక్తికరంగా మారుతుంది. రెండ్రోజులుగా పవన్ మాట్లాడుతున్న మాటలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటన చేసి వచ్చారు. అప్పటినుంచే పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైస్ జగన్ పై విరుచుకుపడుతున్నారు. ప్రతి సమావేశంలోనూ జగన్ ప్రస్తావన తీసుకొస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక అయన బీజేపీ పార్టీకి సపోర్టుగా నిలుస్తున్న విషయం స్పష్టం అవుతూనే ఉంది. తాజాగా అయన అమిత్ షా ని సైతం వార్తల్లోకి తీసుకొచ్చి కొత్త రాజకీయానికి నాంది పలికే ప్రయత్నం చేస్తున్నారు. తనకు బీజేపీ పార్టీ అంటే చాలా గౌరవమని చెప్పిన పవన్ కళ్యాణ్ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అంటే గౌరవమంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక నేటి మీడియా సమావేశంలో పవన్ మాట్లాడిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. జనసేన పార్టీని బీజేపీ లో విలీనం చేయనున్నారా అంటే దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. విలీనం గురించి ఇప్పుడే చెప్పలేనని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ మంచి పాలన చేస్తోందని కితాబిచ్చారు.పవన్ కళ్యాణ్ ఈ తీరుతో ఎలా ముందుకెళ్తారోనని జనసేన సైనికులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి.ఇక పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య బాటలోనే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

AP POLITICS

దిశా కేసు: మహబూబ్ నగర్ జిల్లాలో ఫాస్ట్రాక్ కోర్ట్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *