ఈ వారం రాశిఫలాలు…అద్భుతాలు, అనర్ధాలు

16
 January 5th Rasi Phalalu
 January 5th Rasi Phalalu

January 5th Rasi Phalalu

మేషరాశి : ఈవారం మొత్తం మీద మీకు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు గనుఁ నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఇష్టమైన వ్యక్తులనుండి రావలిసిన సహకారం అందుట అనేది మంచి పరిణామం. సంతానం వలన మాత్రం కొంత అసంతృప్తిని కలిగి ఉంటారు. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాకంటూ ఒక విధానం కలిగి ఉండుట వలన లబ్దిని పొందుతారు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో సమయం గడుపుతారు.

వృషభరాశి :   ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో  నూతన అవకాశాలు పొందుతారు. పెద్దాలతో కలిసి ఆలోచన చేసి ముందుకు వెళ్ళుట మంచిది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం కలదు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు గాను అందరిలో మంచి గుర్తింపును పొందుతారు. కొన్ని కొన్ని విషయంలో ఊహించని ఇబ్బందులకు అవకాశం ఉంది. సమయస్ఫూర్తిని కలిగి ఉండుట వలన ఇబ్బందులను త్వరగా తగ్గిచుకొనే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇస్టపడుతారు. బంధువులను కలుసుకొని అవకాశం ఉంది.

మిథునరాశి: ఈవారం మొత్తం మీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ముఖ్యంగా కుటుంబపరమైన విషయాల్లో పెద్దల సూచనలను పాటించుట సూచన. వ్యాపారంలో కొంత నష్టం ఎదుర్కొనే అవకాశం ఉంది , జాగ్రత్త. నూతన పెట్టుబడులకు కాస్త దూరంగా ఉండుట సూచన. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట అన్నివిధాలా లబ్దిని కలిగిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సోదరపరమైన విషయాల్లో కొంత సంతృప్తిని పొందుటకు అవకాశం ఉంది. అనవ్సరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. మిత్రులను కలుస్తారు.

కర్కాటకరాశి :  ఈవారం మొత్తం మీద మానసికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్దత ఉంటుంది. చిన్న చిన్న పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట సూచన. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సూచనలు అందుతాయి. ఇష్టమైన వ్యక్తులతో సమయం గడుపుటకు ఆసక్తిని చూపిస్తారు. సంతానం విషయంలో మాత్రం మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం మంచిది. మధ్యవర్తిత్వం పనికిరాదు. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి, వాటని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయుట సూచన.

సింహరాశి : ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో అనుకోని మార్పులకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావాల్సిన ధనం కాస్త తగ్గుటకు అవకాశం ఉంది, అలాగే ఆలస్యంగా చేతికి అందుతుంది. బంధువులతో కలిసి సమయాన్ని సరదాగా గడువుతారు. వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. భూసంబంధమైన విషయాల్లో మాత్రం తొందరపాటు వద్దు. చాలావరకు సర్దుబాటువిధానం కలిగి ఉండుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో ఖర్చులను తగ్గించుట వలన మేలుజరుగుతుంది. శ్రమ పెరుగుతుంది.

కన్యారాశి : ఈవారం మొత్తం మీద చేపట్టు పనుల విషయంలో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండుట మేలుచేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలను పాటించుట సూచన. సోదరులతో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. బద్ధకం వీడి ముందుకు వెళ్ళుట సూచన. విదేశీప్రయత్నాలు కాస్త నిదానంగా అనుకూలించే అవకాశం ఉంది, వేచిచూసే ధోరణి అన్నివిధాలా మంచిది. ఉద్యోగంలో గతంలో చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో సర్దుబాటు విధానం అన్నివిధాలా మేలుచేస్తుంది.

తులారాశి:ఈవారం మొత్తం మీద మీలో కొత్త కొత్త ఆలోచనలు మొదలయ్యే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళుట అనేది సూచన. రావల్సిన ధనం చివరి నిమిషంలో చేతికి అందుతుంది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో నలుగురికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు. మీ మాటకు ప్రాముక్యత పెరుగుటకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు.

వృశ్చికరాశి : ఈవారం మొత్తం మీద ప్రత్యేకమైన పనులను మొదలు పెట్టాలనే తలంపును కలిగి ఉంటారు. మానసికపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కాస్త పనిభారం పెరుగుటకు అవకాశం ఉంది , నలుగురిని కలుపుకొని వెళ్ళుట అనేది సూచన. బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. సంతానపరమైన విషయాల్లో సద్ధ్యమైనంత వరకు ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. మిత్రులతో అనుకోని మనస్పర్థలు కలుగుతాయి, జాగ్రత్త. 

 

 January 5th Rasi Phalalu

ధనస్సురాశి: ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను కాస్త నిదానంగా పూర్తిచేస్తరు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడుతుంది. మీకంటూ ఒక విధానం మేలుచేస్తుంది. ఆత్మీయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. నూతన ఉద్యోగ లేక వృత్తిపరమైన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. కుటుంబంలో మీ ఆలోచనలను గౌరవిస్తారు. బంధుమిత్రులతో సర్దుబాటు విధానం మంచిది. చిన్న చిన్న పనులను పూర్తిచేయుట అలాగే పెద్ద పనుల విషయంలో ప్రణాళిక కలిగి ఉండుట అవసరం.

మకరరాశి :ఈవారం మొత్తం మీద నూతన పనులను మొదలు పెట్టువిషయంలో స్పష్టమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో నలుగురికి నచ్చేలా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పెద్దలతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకండి. విదేశీప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది, నూతన ప్రయత్నాలు చేయుట మంచిది. వాహనముల విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కలదు. 

కుంభరాశి : ఈవారం మొత్తం మీద మొదట్లో కొంత ఇబ్బందులను పొందిన, వేచిచూసే ధోరణి వలన లబ్దిని పొందుతారు. నూతన ప్రయత్నాలను మొదలు పెట్టుట యందు మాత్రం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం సూచన. మీ మాటతీరు నలుగురిని ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. వ్యాపారపరమైన విషయాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. కాకపోతే సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం ఉత్తమం. సామాజికరంగంలో పనిచేసే వారు మాత్రం కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళుట సూచన. మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

మీనరాశి : ఈవారం మొత్తం మీద సంతానం విషయంలో పెద్దలతో మాటపడవలసి రావోచ్చును. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్పఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు. మీ ఆలోచనలను ఎదుటివారికి తెలియజేసే విషయంలో వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకొనే ప్రయత్నం చేయుట సూచన. ప్రయాణాలు వాయిదా వేయుట సూచన, తప్పనిపరిస్థితిలో చేయవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకొనే ప్రయత్నం చేస్తారు.

January 5th Rasi Phalalu,Today Rasi Phalalu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here