తెలుగు సినిమాలో ఝాన్వీ కపూర్

3
janvi in telugu movie
janvi in telugu movie

janvi in telugu movie

శ్రీదేవి కూతురుగా గ్లామర్ ప్రపంచలోకి అడుగుపెట్టిన కపూర్ బ్యూటీ ఝాన్వీ కపూర్. అమ్మడిని తెలుగులోనో లేదంటే సౌత్ లోనే నటింప చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా టాప్ హీరోల సరసన ఝాన్వీని తీసుకోవాలని చాలామంది దర్శకులు ట్రై చేస్తున్నారు. కానీ ఎందుకో అమ్మడికి ఈ వైపు పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించడం లేదు. ధఢక్ సినిమాతో బాలీవుడ్ లో మంచి ఎంట్రీ ఇచ్చిన ఝాన్వీ.. శ్రీదేవి వారసత్వాన్ని కంటిన్యూ చేసే సత్తా ఉందనే పేరు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం గుంజనా సక్సేనా బయోపిక్ లో నటించిన ఈ బ్యూటీ దీంతో మరోరెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా తను ఓ తెలుగు సినిమాలో నటించబోతోంది అనే వార్తలు బాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి.
ఝాన్వీ కపూర్ తెలుగు సినిమాలో నటిస్తోంది అంటే నేరుగా కాదు.. తెలుగు మూవీ రీమేక్ లోనట. నిజం.. తను తెలుగులో నేరుగా నటించడం లేదు.

కానీ మన దగ్గర ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ రీమేక్ లో ఝాన్వీని తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు నార్త్ లో చాలామంది డ్యాన్సులు కట్టారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ చేశారు. అంచేత ఝాన్వీకి కూడా అల వైకుంఠపురములో సినిమా గురించి బాగానే తెలిసి ఉంటుందనుకోవచ్చు. మరి తను నటిస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు అల వైకుంఠపురములో హిందీ రీమేక్ లో రణ్ వీర్ సింగ్ నటిస్తాడు అనే ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీ అక్కడ కూడా సూపర్ హిట్ అవుతుందనుకున్నారు. బట్.. తీరా చూస్తే ఓ కొత్త కుర్రాడిని అల్లు అర్జున్ పాత్రలో తీసుకున్నారు. అంచేత.. ఇప్పుడు ఝాన్వీ ఆ కొత్త కుర్రాడితో రొమాన్స్ చేస్తుందా లేదా అనేదే డౌట్. ఎవరైనా పేరున్న హీరో అయితే తను వెంటనే ఎస్ చెప్పి ఉండేదేమో అనుకుంటున్నారు.

tollywood news