అయోధ్య తీర్పుపై ఎవరేమన్నారంటే?

Jayaprakash Narayan And Prakash Raj Response On Ayodhya Verdict

సమస్యాత్మకంగా దశాబ్దాల నుండి కొనసాగుతున్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులదేనని అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పులో పేర్కొంది. దీనిపై లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధినేత జయప్రకాశ్ నారాయణ స్పందించారు. “హిందువులు కానీ, ముస్లింలు కానీ… అన్ని వర్గాల ప్రజలు అయోధ్య వివాదంలో అనవసర రాద్ధాంతానికి ముగింపు కోరుకున్నారు. ఒక స్థానిక భూవివాదం జాతీయ సమస్యగా మారిందంటే అందుకు కారణం పక్షపాత రాజకీయాలు, కొన్ని గ్రూపుల అస్థిత్వ పోరాటం. ఇక ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. మన యువత భవిష్యత్ పై దృష్టి సారిద్దాం” అంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు అంతిమ తీర్పు నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు తన సుప్రసిద్ధ “జస్ట్ ఆస్కింగ్” హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి ట్వీట్ చేశారు. “అయోధ్యలో మందిరం నిర్మిస్తారు, మసీదు కూడా కట్టొచ్చు గాక! కానీ ఇప్పటికే ఎంతో రక్తపాతం జరిగింది. మనిషి ప్రాణం ఎంతో విలువైంది. తదనంతరం జరగబోయే హింసను, రెచ్చగొట్టే ధోరణులను మనం ఆపలేమా! మనిషి ప్రాణాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టలేమా! దయచేసి ఆలోచించండి!” అంటూ ఉద్వేగభరితంగా స్పందించారు.

tags:  AyodhyaVerdict, SupremeCourt, Central Government, #RanjanGogoi, #ChiefjusticeofIndia, dismissed, Hindus, Mandir, Masjid, Loksatta, Jayaprakash Narayan, Prakash raj

అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె చలో ట్యాంక్‌బండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *