తెలంగాణా కాంగ్రెస్ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

JC DiwakarReddy Interesting Comments On Congress Leaders
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  తెలంగాణా కాంగ్రెస్ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరున్న ఆయన ఈ రోజు తెలంగాణా పార్టీ నేతలను కలిసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు  చేసిన పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  .
గత ఎన్నికల సమయంలో ఏపీలో వైసీపీ భారీ మెజారిటీతో గెలవడంతో జేసీ జగన్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే జగన్‌ని ఆకాశానికెత్తడంతో జేసీ వైసీపీలో చేరుతారని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అయితే జేసీ వ్యాపారాల దృష్ట్యా జగన్ తనను టార్గెట్ చేశారని వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నాడు.
అయితే జేపీ తన వ్యాపారాలను కాపాడుకునేందుకు బీజేపీలో చేరిపోతారని కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి జేసీ అతిధిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జేసీ కొద్దిసేపు అక్కడి కాంగ్రెస్ నేతలతో ముచ్చటించారు. అంతేకాదు సరదాగా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. మీరు నాశనమై, మమ్మల్ని నాశనం చేశారని జేసీ అనడంతో పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి దానికి రిపేర్లు చేద్దామని నవ్వుతూ బదులిచ్చారు.

tags : telangana congress, jc diwakar reddy, ap, tdp leader, revanth reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *