తన భర్తకు మంత్రి పదవి రాకపోవడం బాధగా ఉందన్న జోగు రామన్న భార్య

JOGU RAMANNA'S WIFE IS SADDEN

తన భర్తకు మంత్రి పదవి రాకపోవడం బాధగా ఉందని మాజీ మంత్రి జోగు రామన్న భార్య రమ చెప్పారు. మంత్రి పదవి రాకపోవడంతో తన భర్తకు బీపీ ఎక్కువైందన్నారు. తన భర్త అజ్ఞాతంలోకి వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు.అధిష్టానం ఆదేశాల మేరకు తాము నడుచుకొంటామని ఆమె చెప్పారు. 2014 నుండి 2018 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో జోగు రామన్న అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ దఫా కేసీఆర్ మంత్రివర్గంలో జోగు రామన్నకు మంత్రి పదవి దక్కలేదు.దీంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఆయన కుటుంబసభ్యులకు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. అనారోగ్యం కారణంగానే తాను కార్యకర్తలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారని సమాచారం.

అజ్ఞాతంలోకి వెళ్ళిన మాజీ మంత్రి జోగు రామన్న కుటుంబసభ్యులకు అందుబాటులోకి వచ్చారు.అనారోగ్యం కారణంగానే అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ఆయన సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి నుండి మాజీ మంత్రి జోగు రామన్న కార్యకర్తలకు కూడ అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు. కేబినెట్ లో బెర్త్ దక్కని కారణంగానే జోగు రామన్న కుటుంబసభ్యులకు కూడ చెప్పకుండానే వెళ్లిపోయాడని ప్రచారం సాగింది. ఈ విషయమై కుటుంబసభ్యులతో పాటు, పార్టీ క్యాడర్ కూడ తీవ్రంగా ఆందోళన చెందింది.

కేబినెట్ లో బెర్త్ దక్కలేదనే కారణంగానే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగింది. కానీ, ఈ విషయమై రామన్న స్పస్టత ఇచ్చారు. అయితే సోమవారం రాత్రి పూట టీఆర్ఎస్ లో రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఓ వ్యక్తి కారణంగానే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని అతడిపై మరో వర్గం దాడికి దిగిందిమున్నూరు కాపు సామాజిక వర్గం నుండి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇదే సామాజిక వర్గానికి చెందిన దాస్యం వినయ్ భాస్కర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కింది.

EX MINISTER JOGU RAMANNA’S LATEST NEWS

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *