వైఎస్సార్ సీపీలోకి జోరుగా వలసలు

Spread the love

JOININGS IN YSRCP

  • జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు నేతలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్సార్ సీపీలో చేరగా.. తాజాగా శనివారం భారీ స్థాయిలో ఈ చేరికలు సాగాయి. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన అనంతరం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి రాత్రి 9.30 గంటల వరకు పలువురు నేతలు జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ స్థానం నుంచి టికెట్ పొందిన ఆదాల ప్రభాకర్‌ రెడ్డి జగన్ సమక్షంలో పార్టీలో చేరడం విశేషం. అలాగే మరోవైపు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీగా గెలుపొంది, తర్వాత టీడీపీలోకి వెళ్లిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైఎస్సార్ సీపీలోకి వచ్చేశారు. ఆమె తన భర్తతో కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మంత్రి అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి, మాజీ మంత్రి బల్లి దుర్గా ప్రసాద్, విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, సంతనూతలపాటుకు చెందిన దారా సాంబయ్య, డాక్టర్ రాంచంద్రారెడ్డి తదితరులు వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ జగన్ ను కలిసినప్పటికీ ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. ఈ విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *