జర్నలిస్ట్ కుటుంబం ఆత్మహత్య

14

Journalist family sucide

అనారోగ్యం కారణంగా మంచిర్యాల జిల్లాలో ఓ జర్నలిస్ట్ కుటుంబం ఆత్యహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మంగళవారం జరిగింది. జిల్లాలోని బెల్లంపల్లికి చెందిన మల్లేశ్, నర్మద దంపతులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రికి వెళ్లలేక, వైద్యానికి డబ్బులు లేక పట్టణంలోని పోచమ్మ చెరువులోకి దూకి ఆత్యహత్య చేసుకున్నారు. దంపతులతో పాటు పిల్లాపాపలు కూడా ఆత్యహత్య చేసుకున్నారా? అనేది తెలియదు. పోలీసులు దర్యాప్తు చేస్తేకానీ పూర్తి వివరాలు తెలియవు. జర్నలిస్టు మల్లేష్ బెల్లంపల్లిలో 10టీవీ (రిపోర్టర్ గా) పనిచేస్తున్నారు.