ఏపీ ఎన్నికల్లో అలసి అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్న కేఏ పాల్

KA Paul taking rest in USA

కేఏపాల్ ఏపీ ఎన్నికల వేళ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు పలు టాప్ టీవీ చానెళ్లు ఆయనను పదేపదే లైవ్ లోకి తీసుకొచ్చి ఆయన చేసే సంచలన వ్యాఖ్యలను పదేపదే హైలెట్ చేసి ఆయనను ‘యూట్యూబ్ స్టార్’ ను చేసేశాయి. కేఏ పాల్ కనిపిస్తే చాలు మొన్నటి వరకు లక్షల వ్యూస్ వచ్చేశాయి. అంతటి పాపులారిటీ సంపాదించిన కేఏపాల్ ఎన్నికల అనంతరం అమెరికా వెళ్లిపోయాడు.

ఇప్పుడు అమెరికాలో వివిధ క్రిస్టియన్ చర్చిలు మిషనరీస్ లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఆయన ఉదయాన్నే జాగింగ్ యోగా చేస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వచ్చేశాయి. స్వతహాగా మతబోధకుడు అయిన కేఏ పాల్ అక్కడ వివిధ క్రిస్టియన్ల సమావేశంలో ప్రసంగాలు చేస్తున్నారు. ఇక సాయంత్రం రాత్రి తన ప్రజాశాంతి పార్టీ కోసం ఏపీలో కష్టపడ్డవారితో లైవ్ చాట్ నిర్వహిస్తూ భరోసానిస్తున్నారు. గెలుపుపై నమ్మకం వ్యక్తం చేస్తూ నియోజకవర్గాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

కేఏ పాల్ ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ సహా వివిధ నగరాల్లో క్రైస్తవ చర్చిలను సందర్శిస్తూ ఆదివారాలు క్రిస్టియన్ మత కార్యక్రమాల్లో ప్రసంగిస్తూ తన రోజువారీ కార్యకలాపాలతో బిజీగా మారారు. మత బోధనలు చేస్తూ వివిధ అధికార ప్రతిపక్ష నాయకులతో సమావేశమవుతూ క్రైస్తవ మత ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నట్టు వివిధ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. .. ఏపీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన కేఏ పాల్ ఇప్పుడు అమెరికాలో ఈ గ్యాప్ లో రిలాక్స్ అవుతూనే తన మత బోధనలు చేస్తూ గడుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *