మానవత్వం లేకుండా విద్యార్థులను కట్టివేసి..

kadiri school teacher tortured students

student torture by teacher in kadiri
student torture by teacher

కదిరి మున్సిపల్ పరిధిలోని మౌనిక థియేటర్ దగ్గర ఉన్న నూలుబండ మున్సిపల్ యూపీ స్కూల్ లో ఇద్దరు చిన్నారులు అల్లరి చేసారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి గారు తాళ్లతో ఇలా బంధించారు.

student torture by teacher in kadiri

కదిరి పట్టణంలో మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల లో పవన్, మహమ్మద్ 3,5వతరగతి చదువుతున్న విద్యార్థులను అల్లరి చేసారని తాళ్లతో చేతులు,పాదాలనుకట్టివేసి హింసించడాన్ని ఖండిస్తూ AISF నాయకులు పాఠశాల ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా AISF జిల్లా సహాయ కార్యదర్శి వల్లం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మానవత్వం లేకుండా విద్యార్థులను తాళ్లతో కట్టివేసి హింసించడం చాలా దారుణమన్నారు. సమాజం మీద అవగాహన లేని 3 వ తరగతి చదువుతున్న చిన్నారులపై దుర్మార్గంగా వ్యవహరించడం ఉపాధ్యాయ వృత్తికి చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు.

రెండు రోజుల క్రితం పాఠశాలకు సరైన సమయానికి రాలేదని అదే పాఠశాలకు చెందిన 7 మంది ఉపాధ్యాయులపై అధికారులు మెమోలు ఇవ్వడం జరిగింది. అది మరవకముందే చిన్నారులను హింసించడం లాంటి ఘటన చోటుచేసుకోవడం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి వ్యవహార శైలి పై ఉన్నత అధికారులు స్పందించి విచారించి వెంటనే పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి శేషం మహేంద్ర, సహాయ కార్యదర్శులు కోలా బాబు, విజయ్ ,పద్మభూషణ్ నాయక్, తనకల్లు మహేంద్ర, గణేష్, ఉపేంద్ర పాల్గొన్నారు

student torture by teacher in kadiri,Videos Goes Viral,Kadiri Muncipal School,Pawan,Mahammood,AISF Leaders,Noolubanda Muncipal School,Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *