తెలంగాణా శాసనమండలి చైర్మన్ గా కడియం శ్రీహరి

KADIYAM  SRIHARI AS THE CHAIRMAN OF LEGISLATIVE COUNCIL

తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో కడియం శ్రీహరి కి షాక్ తగలనుంది. ఈసారి మంత్రివర్గంలో కడియం శ్రీహరి ని తీసుకునే ఆలోచన లేదు అని తాజా పరిణామాల వల్ల అర్థమవుతోంది. శాసనమండలి చైర్మన్ గా కడియం శ్రీహరి కి అవకాశం ఇవ్వనున్నట్లు గా తెలుస్తోంది. కడియం శ్రీహరి మాత్రం శాసనమండలి చైర్మన్ పదవి పై ఒకింత నిరాసక్తతను ప్రదర్శిస్తున్నా కేసీఆర్ మాత్రం శాసనమండలి చైర్మన్ గా కడియం ని నియమించాలని ఆలోచనలో ఉన్నారు.
అందులో భాగంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గా కడియం శ్రీహరికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మండలి చైర్మన్ గా కొనసాగుతున్న స్వామిగౌడ్ పదవీ కాలం మార్చి 28తో ముగియనున్నది. అటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రెడ్యా నాయక్ లేదా రేఖానాయక్ లో ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని స్వామి గౌడ్ కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *