పెళ్లికి రెడీ అంటున్న కాజల్ అగర్వాల్

Kajal Agarwal is ready to marry

కాజల్ అగర్వాల్‌ ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది . కాబోయే వరుడు ఎలా ఉండాలి? అతనిలో ఏయే క్వాలిటీస్ ఉండాలి… ఇలాంటి విషయాలపై చందమామ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్  మనసులోని మాట చెప్పింది . వయసు 35కి చేరుతున్న సమయంలో… ఆమెతో చిట్ చాట్ చేస్తున్న ప్రతీ ఒక్కరూ మీ పెళ్లెప్పుడు అని ప్రశ్నిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇన్నాళ్లూ… నాకు అప్పుడే పెళ్లేంటి? పెళ్లి గురించి ఆలోచించేంత టైమ్ లేదు, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు అంటూ మాట దాటవేసింది. ఇటీవల లక్ష్మీ మంచుతో చిట్ చాట్‌లో కూడా ఇదే ప్రశ్న రావడంతో… ఇక లాభం లేదనుకున్న కాజల్ రూమర్లకు చెక్ పెట్టేసింది. పెళ్లిపై తన మనసులో మాటను బయటపెట్టింది. పెళ్లికి సంబంధించిన ప్లాన్‌ను వివరించింది.
తాను పెళ్లికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ తాను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. అంతే కాదు టైమ్ కూడా చెప్పేసింది  కాజల్ అగర్వాల్.  ఆల్రెడీ వరుడు ఫిక్సైపోయినట్లే అని కాజల్ మాటలద్వారా తెలుస్తుంది. ఇన్నాళ్లూ సరైన అబ్బాయి దొరకట్లేదని చెప్పుకొచ్చిన చందమామ, ఇప్పుడు మాత్రం తన మనసు ఆల్రెడీ ఒకరికి ఇచ్చేసినట్లు క్లారిటీ వచ్చేసింది. ఆ వరుడు ఓ బిజినెస్‌మేన్ అనే ప్రచారం జరుగుతోంది. పెద్దలే దగ్గరుండి ఈ వివాహ సంబంధాన్ని కుదిర్చినట్లు  కూడా తెలుస్తుంది . కాజల్ ప్రస్తుతం తమిళనాట కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. దాంతోపాటూ మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మ్యారేజ్ తర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తుందనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు సినీ  అనలిస్టులు .
tags : Kajal agarwal, marriage, business man, chandamama fame

http://tsnews.tv/construction-workers-protest-ap-minister-anil-kumar-yadav/
http://tsnews.tv/cm-jagan-mohan-reddy-about-sand-shortage/

Related posts:

14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?
అనుష్కకే దిక్కు లేదు.. కీర్తి సురేష్ ను పట్టించుకుంటారా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *