21న కాళ్వేశ్వరం ప్రారంభం

Spread the love

KALESWARAM INAUGURATION ON 21ST

  • ఏసీ సీఎం జగన్ ను ఆహ్వానించనున్న కేసీఆర్
  • అమరావతి వెళ్లి స్వయంగా పిలవనున్న తెలంగాణ సీఎం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయనే స్వయంగా అమరావతి వెళ్లి జగన్ కు ఆహ్వానం పలకనున్నారు. ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చక్కని సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జగన్ సైతం కేసీఆర్ తో కలిసి ముందుకెళ్తున్నారు. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఆయన సానుకూల నిర్ణయం తీసుకోవడమే ఇందుకు నిదర్శనం. అలాగే విభజన సందర్భంగా నెలకొన్న సమస్యలను కూడా రెండు రాష్ట్రాలూ సానుకూలంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను ముఖ్య అతిథిగా పిలవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

TS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *