కోలిక్కి వచ్చినా కల్కి ఆశ్రమం వ్యావహరం?

Spread the love

Kalki aasram issue

తమిళనాడు తో పాటు చిత్తూరు జిల్లా వరదయ్య పాళెం మండలం బత్తలవలం గ్రామ సమీపంలో ఉన్న కల్కి భగవాన్ ఆశ్రమంలో కూడా ఐటి అధికారులు దాడులు చేశారు ఇక్కడ కూడా కోట్లు రూపాయలు డబ్బు, గోల్డ్ బిస్కెట్ లు స్వాధీనం చేసుకున్నారు.

5 కోట్లు విలువచేసే వజ్రాలు

26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం

40.39 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విదేశీ కరెన్సీ

మొత్తం 93 కోట్ల విలువ చేసే బంగారు, నగదు స్వాధీనం

409 కోట్ల రూపాయల సంబంధించి రసిదులను అడుగుతున్న ఐ.టి అధికారులు..

కలానికి కల్కీ పోటు
◆ స్టూడియో ఎన్ పెట్టుబడిపై ఆధారాలు
◆ లెక్క తేల్చిన ఐటీ శాఖ
◆ 93కోట్ల బంగారం, నగదు స్వాధీనం
◆ 409 కోట్లకు రశీదుల్లేవ్

వారు ‘కృత్రిమ దేవుళ్ళు’.
ప్రచారానికి ఓ ఛానల్ కావాలనుకున్నారు. స్టూడియో ఎన్ కొనుగోలు చేశారు. కల్కి దంపతులు మూడోరోజు కూడా అజ్ఞానం నుంచి బయటకు రాలేదు. రూ.409 కోట్లకు రశీదులు లేవు. మొత్తం 93 కోట్ల బంగారం, నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూ దందాలకు సంబంధించిన 1182 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. చాలా వరకు బినామీలు ఉండటం గమనార్హం. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు వెలుగులోకి రావాలంటే కల్కీ వేలుముద్రలు పాస్ వర్డ్ గా ఉండటంతో అధికారులు సంబంధిత హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడా…నొక్కుడే..:
హైదరాబాద్, మణికొండలోని పంచవటి కాలనీలో స్టూడియో ఎన్ ఛానల్ ఉంది. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాస రావు దగ్గర నుంచి 2014లో ‘ ఏకం కల్కి ఆధ్యాత్మిక ‘ కేంద్రం వారు ఈ ఛానల్ కొనుగోలు చేశారు. దేశ వ్యాప్తంగా ‘ ఏకం కల్కి ఆధ్యాత్మిక ‘ కేంద్రాలు, ఆఫీసులలో జరుగుతున్న ఐటీ సోదాల్లో భాగంగా స్టూడియో ఎన్ లో కూడా సోదాలు జరిగాయి. సిఇఓ రూపంలో ఓ సుందరాంగికి బాధ్యతలు. అంతే జర్నలిస్టులకు జీతాలు ఇవ్వకుండా మెడబట్టి గెంటేశారు. అయితే ఆ పాత్రికేయులకు కోట్లలో జీతాలు ఇచ్చినట్లు లెక్కల్లో పక్కాగా చూపారు. ఐటీ దాడుల సందర్భంగా ఈ విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఛానల్ మూతపడింది. అయితే ఇక్కడ నొక్కిన సొత్తు ఓ మహిళా సీఇఓ బిగానే వెనుకేసుకుందని తెలిసింది.

ఇంత దొరికింది..:
కల్కి భగవాన్‌ ఆశ్రమంలో మూడో రోజు ఐటీ సోదాలు పూర్తయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటికే భారీగా అక్రమాస్తులను ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. కీలక పత్రాలను, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తెరవాలంటే కల్కీ వేలుముద్రలే పాస్ వర్డ్స్ కావడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కల్కి ఆశ్రమం వ్యవస్థాపకులు కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌ కుమార్‌, పద్మావతిలు దాడులజరుగున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధికారులు చేపట్టిన తనిఖీల్లో క్యాంపస్‌-3లో భారీగా విదేశీ నగదు, బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణ నాయుడు, కోడలు ప్రీతినాయుడు, ట్రస్ట్‌ నిర్వహకుడు లోకేష్‌ దాసాజీని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. స్వదేశీ, విదేశీ భక్తుల ద్వారా భారీ ఎత్తున విరాళాలు సేకరించి.. వందల ఎకరాలు, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు. ఈ దాడుల అనంతరం అధికారులు తాము స్వాధీనం చేసుకున్న వివరాలను వెల్లడించారు. అందులో రూ.5 కోట్ల విలువ చేసే వజ్రాలు, 26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం, 40.39 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విదేశీ కరెన్సీ ఉంది. మొత్తం 93 కోట్ల విలువ చేసే బంగారు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. రూ.409 కోట్లకు సంబంధించి రసీదులు లేవని అధికారులు చెపుతున్నారు. ఈ సందర్భంగా కల్కి ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. ఈ విచారణలో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తుల సమా చారాన్ని రాబట్టినట్లు తెలిసింది. బినావిూల పేరుతో వేల ఎకరాల భూముల అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు.

నవంబరు 3న వైజాగ్ లో జనసేన లాంగ్ మార్చ్

కచ్చులూరు వద్ద బోటు వెలికితీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *