కళ్యాణ్ కు మరో షాక్ తప్పదా

KalyanRam Movie Disaster

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో కళ్యాణ్ రామ్. చాలా ఏళ్లుగా తనకంటూ ఒక స్టార్డం తెచ్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. తనే నిర్మాతగా మారి విజయం అందుకున్నా … ఆ విజయాలను కొనసాగించడం లో  ప్రతిసారి విఫలం అవుతూనే ఉన్నాడు. ఇక లేటెస్ట్ గా భారీ పోటీ ఉన్న సంక్రాంతి బరిలో ఎంత మంచి వాడవురా అంటూ నిలిచాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.

టైటిల్‌కు తగ్గట్టు గానే.. హీరో మంచివాడు. ఎంత అంటే ఆ మంచితనం ప్రేక్షకులు భరించలేనంత. దర్శకుడు ఎంచుకున్న కథ బావున్నా.. దాన్ని మంచి కథనం గా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. సినిమా ఆద్యంతం ఒకరకమైన మూడ్ లో సాగడం.. పాత్రల మధ్య సరైన సంఘర్షణ లేకపోవడం… అలాగే ఇలాంటి సినిమాల్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఎమోషనల్ సీన్స్ అన్నీ తేలిపోయాయి. తనికెళ్ల భరణి, సుహాసిని. శరత్ బాబు ల మధ్య వచ్చే సన్నివేశాలు తప్ప ఎక్కడ ఎమోషనల్‌గా ఎంగేజ్ చేయలేకపోయాడు దర్శకుడు.

ఒక రకంగా ఈ టైంలో విడుదల కావడం ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు నచ్చుతాయి ఏమో. ఆ కారణంగా థియేటర్ కు చాలా వరకు వస్తారు. కంటెంట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం పర్వాలేదు అని ఈ సినిమాను పండుగకు విడుదల చేశారు అనుకోవచ్చు. కానీ ఎలా చూసినా కళ్యాణ్‌రామ్ క్యారెక్టర్ కూడా ఏమంత గొప్పగా తీర్చిదిద్దలేదు దర్శకుడు. ఇప్పటికే ఒక హిట్టు నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా ఉంది కళ్యాణ్‌రామ్ కెరియర్. ఈ టైంలో ఇలాంటి కథను ఎంచుకుని మంచి పని చేసాడు కానీ.. అందుకు తగ్గ కథనం పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం ఎమోషనల్ గా ఈ సినిమా ఆకట్టుకోలేకపోవడంతో కళ్యాణ్ రామ్ కు మరో పరాజయం తప్పదని అనిపిస్తోంది.

EnthaManchivadavura Review

One thought on “కళ్యాణ్ కు మరో షాక్ తప్పదా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *