క్వీన్ చూపు… కమలం వైపు…???

5
Kangana
Kanagana # bollywood # Queen

సాధారణంగా సినిమా తారలు ప్రభుత్వాలను, అధికార పార్టీలను ఎదురించే సాహసం చేయరు. కంగన మాత్రం శివసేన నాయకులకు సవాల్‌ విసిరి మరీ ముంబైలో అడుగుపెట్టారు. శివసేనను సవాల్‌ చేసి మరాఠా గడ్డపై అడుగుపెట్టిన ‘క్వీన్‌’వెనుక ఎవరున్నారనే దానిపై బాగా చర్చ జరుగుతోంది. కాషాయ దళం అండ దండలు కంగనకు ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రనౌత్‌..‘మహా’సర్కారుపై అంతే ఫైర్ అవుతోంది. అక్కడితో ఆగకుండా సవాల్‌ చేస్తూనే ఉంది. ఇంత ధైర్యం ఆమెకు ఎక్కడిదని,  కంగనను వెనకుండి నడిపిస్తున్నది ఎవరు? అని జోరుగా చర్చ నడుస్తోంది.

యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో మొదలైన వివాదం ఇప్పుడు ‘క్వీన్‌ వర్సెస్‌ సేన’గా మారిపోయింది. ప్రభుత్వాన్ని ఎదురించి మరఠా గడ్డపై అడుగుపెట్టిన క్వీన్ కు కమలం అండగా ఉందని, అందుకే భయం లేకుండా  ఉధ్ధవ్ పై విరుచుకుపడుతుందని వివిధ రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. ఎప్పట్నుంచో కంగన అమిత్ షాకు టచ్ లో  ఉందని, అందుకే శివసేనపై విరుచుకుపడుతున్నట్లు తెలుపుతున్నాయి.  ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే కచ్చితంగా కంగన బీజేపీ చేరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.