కర్ణాటకలో నటుడు ఉపేంద్ర నిరాహార దీక్ష

Spread the love

Kannada hero Upendra Protesting

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్థానిక పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకలోనూ ఇదే డిమాండ్ వినిపిస్తోంది. కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలని హీరో ఉపేంద్ర డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం పోరాటానికి సిద్దమని ప్రకటించిన ఆయన..ఈ నెల 14,15 తేదీల్లో నిరాహారదీక్ష చేయబోతున్నట్టు తెలిపారు. తన పోరాటానికి కర్ణాటక యువత మద్దతుగా నిలవాలని కోరారు.కొన్నాళ్లుగా రాజకీయాలపై సీరియస్‌గా ఫోకస్ చేసిన ఉపేంద్ర.. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా ప్రజలకు చేరువ కావాలని చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న నినాదంతో పోరాటం మొదలుపెట్టనున్నారు. కాగా,కర్ణాటక రాజధాని బెంగళూరు దేశ ఐటీ రాజధాని కావడంతో అన్ని రాష్ట్రాల వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలవారి నుంచి పోటీ ఎక్కువ కావడంతో స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండుతో ఉపేంద్ర పోరాటం చేయబోతున్నారు.

TAMOTA RATE IN PAK INCREASE

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *