తెలుగులో దుల్కర్ రేంజ్ మారబోతోందా.. ?

Kanulu Kanulanu Dhochaayante Review

దుల్కర్ సాల్మన్.. మళయాలంలో మోస్ట్ టాలెంటెడ్ కుర్రాడుగా పేరు తెచ్చుకున్నాడు. మమ్మూట్టి తనయుడుగా ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. మాలీవుడ్ కు కాబోయే సూపర్ స్టార్ అని ఇన్సియల్ డేస్ లోనే అనిపించుకున్న దుల్కర్.. అటుపై సౌత్ లోని ఇతర భాషలతో పాటు హిందీలోనూ సత్తా చాటుతున్నాడు.తెలుగులో మణిరత్నం ఓకే బంగారంతో ఆకట్టుకున్న దుల్కర్.. తర్వాత మహానటితో మెస్మరైజ్ చేశాడు. ఇక లేటెస్ట్ గా ఆ క్రేజ్ తోనే మరో డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. కనులు కనులను దోచాయంటే అనే పేరుతో వచ్చిన ఈ సినిమా వెరీ ఇంప్రెసివ్. ఆశ్చర్యంగా సూపర్ అనే టాక్ తెచ్చుకుంది. దుల్కర్ తన పాత్రకు తెలుగులోనూ డబ్బింగ్ చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మరో విశేషం ఏంటంటే.. ఇది మళయాల సినిమా కాదు. తమిళ్ మూవీ. పైగా దుల్కర్ కు 25వ చిత్రం. సైబర్ క్రైమ్, ఆన్ లైన్ మోసాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే తెలుగులో ప్రాపర్ గా ప్రమోషన్ చేయలేదు. ఆ కారణంగానే అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే స్టఫ్ ఉన్న మూవీతో దుల్కర్ కు తెలుగులో మంచి మార్కెట్ ను ఓపెన్ చేయించే అవకాశాన్ని పోగొట్టుకున్నారనే చెప్పాలి. నిజంగా ఈ మూవీ ఈ వారంలో వచ్చిన బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఇంకా చెబితే ఈ జానర్ లో ఈ రేంజ్ ఎంటర్టైనర్ ఈ మధ్య కాలంలో సౌత్ లోనే రాలేదని చెప్పాలి. మరి ఇకనైనా కాస్త ప్రమోషన్స్ పెంచుకుంటే దుల్కర్ సాల్మన్ రేంజ్ తెలుగులో మారుతుంది. ఖచ్చితంగా అతనికీ ఇక్కడ ఓ మార్కెట్ ఫామ్ అవుతుంది. ఎలాగూ మంచి కథలే ఎంచుకుంటాడనే పేరుంది. కాబట్టి అతనికీ కొత్త మార్కెట్ దొరుకుతుంది. ఇక్కడా డబ్బింగ్ సినిమాల గిరాకీ మారుతుంది. ఏదేమైనా కనులు కనులను దోచాయంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనే చెప్పాలి.

Kanulu Kanulanu Dhochaayante Review,Dulquer Salmaan,Review, Rating,Dulquer Own Dubbing In Telugu,Periyasamy,Dulquer Will Better in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *