Kapildev participated green challenge
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విన్నూత్న రూపంలో చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతు ప్రముఖుల మన్నలను పొందుతోంది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని సుందర్ నగర్ తన నివాసంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, వాతావరణ కాలుష్యం తగ్గి వాతావరణం బాగుంటుందన్నారు. భారతీయులు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మన భవిష్యత్ తరాల కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.