కార్తికేయ సినిమాకి భారీ హైప్ వ‌చ్చేదెలాగో..?

Spread the love
KARTHIKEYA.. GUNA
కార్తికేయ… అదేనండీ, ఆర్.ఎక్స్‌.100 సినిమాతో ఒక్క‌సారిగా దూసుకొచ్చిన కుర్ర హీరో! ఆ సినిమాతో యూత్ కి బాగా న‌చ్చేశాడు. అమ్మాయిల్లో కూడా మంచి క్రేజ్ వ‌చ్చింది. చిన్న సినిమాగా వ‌చ్చిన ఆర్.ఎక్స్‌.100.. ఒక్క‌సారిగా పేద్ద రేంజ్ హిట్ సాధించింది. దాంతో కార్తికేయ‌కు అమాంతంగా మార్కెట్ వ‌చ్చేసిందని అంద‌రూ అన్నారు. ఇంకేం, ఆ ధీమాతో రెండో సినిమా హిప్పీగా బాగా బ‌డ్జెట్ పెట్టారు. ఆ సినిమా కంటెంట్ కూడా యువ‌త‌కు బాగా న‌చ్చేస్తుంద‌న్న కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేశారు. చివ‌రికి, సొంతంగా విడుద‌ల చేసుకుని నిర్మాత‌లు చేతులు కాల్చుకున్నారు. అయితే, ఇప్పుడీ విష‌యాల ప్ర‌స్థావ‌న ఎందుకంటే… కార్తికేయ మూడో సినిమా గుణ విడుద‌ల ప‌రిస్థితిపై కొన్ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.
హిప్పీ సినిమా ఆడ‌క‌పోవ‌డంతో గుణను కొనేందుకు ఎవ్వ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని స‌మాచారం. ఇది కూడా ఆర్.ఎక్స్‌. 100 స‌క్సెస్ అయిన హీట్ లో మొద‌లైన సినిమా కాబ‌ట్టి, ఈ చిత్ర‌ నిర్మాతలు కూడా బాగానే ఖ‌ర్చుపెట్టేశార‌ట‌! అయితే, ఈలోగా హిప్పీ రిలీజ్ అయి, ఫ్లాప్ అయింది. దీంతో, ఆ ప్ర‌భావం త‌మ‌పై ప‌డేలా ఉంద‌నే టెన్ష‌న్ స‌ద‌రు నిర్మాత‌కు మొద‌లైంది. పోనీ, ట్రైల‌ర్ కి బీభ‌త్స‌మైన రెస్పాన్స్ వ‌చ్చేస్తే, ఆ హీట్ లో వ్యాపారం కానిచ్చుకుందాం అనుకుంటే… అదీ వ‌ర్కౌట్ కాలేదు. దీంతో, ఇప్పుడీ సినిమాకి భారీ ఎత్తున ప‌బ్లిసిటీ తెచ్చిపెట్ట‌డం ఎలా అనే అంశంపై నిర్మాత‌లు దృష్టిపెట్టార‌ట‌. ఆగ‌స్టు నెలాఖ‌రున విడుద‌ల‌కు ముహూర్తం పెట్టుకున్నారు. అదే రోజున నాని సినిమా గ్యాంగ్ లీడ‌ర్ రిలీజ్ ఉంటుంద‌ని అంటున్నారు! దాదాపు నెల‌కుపైగా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి, ఈలోగా ఏదో ఒక‌ర‌కంగా ప‌బ్లిసిటీ పెంచి, గ‌ట్టున‌ప‌డాల‌ని నిర్మాతలు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *