చచ్చిన వాడి భార్యనే కెలికిన కార్తికేయ

6
kartikeya movie
kartikeya movie

kartikeya movie

ఆర్ఎక్స్ 100తో ఓవర్ నైట్ ఫేమ్ అయిన హీరో కార్తికేయ. స్వయంకృషితో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోన్న కార్తికేయకు ఆ తర్వాత ఆస్థాయి విజయం పడలేదు. అయినా గుణ 369వంటి సినిమాతో విమర్శకులను మెప్పించాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ క్యాంప్ లోకి ఎంటర్ అయ్యాడు. అయితే ఆ బ్యానర్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే సినిమాలకు భిన్నంగా ‘చావు కబురు చల్లగా’అనే సినిమాతో వస్తున్నాడు.  బన్నీవాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రంతో కౌశిక్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సోమవారం కార్తికేయ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. మొత్తంగా టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. శవాలను స్మశానానికి తీసుకువెళ్లే వాహనం డ్రైవర్ గా ఇప్పటి వరకూ ఏ మాస్ హీరో చేయని పాత్రలో కనిపిస్తున్నాడు కార్తికేయ. ఒక రకంగా ఇది డేరింగ్ డెసిషన్ అనే చెప్పాలి.

టీజర్ అంతా కార్తికేయే ఉన్నాడు. అతని తల్లి పాత్రలో ఆమని కూడా కీలకంగా కనిపించబోతోందని అర్థమౌతోంది. కంప్లీట్ మాసివ్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఆమని అతన్ని తిడుతూ.. చచ్చినవాడి పెళ్లాన్ని స్మశానంలోనే కెలికాడు అంటుంది. అందుకు అతను ఆమె బావుంది. దానికీ ఎవరూ లేరు అని చెప్పడం చూస్తే ఆ పాత్రకు క్యారెక్టర్ ఉండదు అని అర్థమౌతోంది. మొత్తంగా కార్తికేయ తన ఇమేజ్ ను మార్చుకునేందుకు కూడా ఈ పాత్ర ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటోందో కానీ.. షూటింగ్ మాత్రం చాలా వేగంగా సాగుతోంది.

tollywood news