ఏప్రిల్ 3 నుంచి కవిసమ్మేళనాలు

5

KAVI SAMMELAN FROM APRIL 3

స్వతంత్రభారత అమృతోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 3 న అన్ని జిల్లాకేంద్రాలతోపాటు రాష్ట్రస్థాయిలో రవీంద్రభారతిలో కవిసమ్మేళనాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులు, మహోత్సవాల కమిటీ సభ్యకార్యదర్శి మామిడి హరికృష్ణ తెలిపారు. కవిసమ్మేళనానికి “స్వాతంత్రస్ఫూర్తి” ని “ధీమ్” గా నిర్ణయించినట్లు తెలిపారు. 75 వ స్వతంత్రభారత దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా 75 వారాలపాటు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 12 న పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రారంభవేడుకల్లో ప్రకటించారు. అందుకనుగుణంగా స్వాతంత్ర పోరాటఘట్టాల గురించి నేటితరం యువత, పిల్లలకు అవగాహన కల్పించేందుకు స్వతంత్రభారత అమృతోత్సవ కమిటీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. అందులో భాగంగా ఏప్రిల్ 3 న “కవిసమ్మేళనం” నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను హరికృష్ణ కోరారు. జిల్లా కేంద్రాలలో నిర్వహించే కవిసమ్మేళనాలపై మీడియా సహకారంతో విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించాలని జిల్లా పౌరసంబంధాల అధికారులకు సూచించారు.