చాలా రోజుల తర్వాత మహిళా సదస్సులో పాల్గొన్న కవిత..

Kavitha attend women’s conference

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చాలా కాలం తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి భాగస్వామ్యంతో హైదరాబాద్ లో గ్లోబల్ కాంపాక్ట్ నెట్ వర్క్ ఇండియా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఓ మహిళా సదస్సు నిర్వహించింది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. ‘డెవలపింగ్ ఉమెన్ లీడర్ షిప్: ఎ రోడ్ మ్యాప్ టు సక్సెస్’ పేరిట జరుగుతున్న ఈ సదస్సులో కవిత ప్రసంగించారు. దీనిగురించి ఆమె ట్వీట్ చేస్తూ, ఒకే వేదికపై అనేకమంది శక్తిమంతమైన మహిళలను చూడడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి నిద్ర పోయేవరకు అటు గృహిణిగా, పిల్లలను సక్రమంగా పెంచడం తల్లిగా, తాము ఎంచుకున్న రంగంలో దూసుకుపోయే వ్యాపారవేత్తగా, ఉద్యోగినిగా తమ కెరీర్లను విజయవంతం చేసుకునేందుకు చాలా మంది మహిళలు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కార్పొరేట్ ప్రపంచానికి చెందిన ఎంతోమంది మహిళలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుండడం హర్షణీయం అని పేర్కొన్నారు. అంత మంది మహిళలు ఒకే వేదిక మీద చూడడం సంతోషంగా ఉందని, ఇక ఈ రెండు రోజుల సదస్సు ద్వారా మరిన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు అని ఆశాభావం వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత.

tags: kalvakuntla kavitha, telangana jagruthi, hyderabad, global compact network india, women work shop

టీడీపీకి షాక్ ఇస్తూ వంశీ బాటలో మరో నేత ?

కార్మికుల కోసం సీఎం కేసీఆర్ తో మాట్లాడనున్న నితిన్ గడ్కరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *