సంచలనం గా మారిన కేసీఆర్ కు జగన్ బహిరంగ లేఖ

KCR and JAGAN open letter created sensation… రీజన్ ఇదే

జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్న ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆదిలోనే హంస పాదు అన్న చందంగా ఉంది పరిస్థితి. ఒకపక్క జగన్ కేటీఆర్ భేటి తర్వాత ఇరుపార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగుతాయని భావిస్తుంటే మరోపక్క వీరి కలయిక పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత కేసిఆర్ ఏ విధంగానూ ఏపీకి సహకరించలేదని విమర్శిస్తున్నారు ఏపీ లోని విభిన్న వర్గాలు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడా అడ్డుపడ్డారని, మొదటినుంచి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా కెసిఆర్ ప్రవర్తించారని ఫైర్ అవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగితే అది జగన్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలపై కెసిఆర్ స్పందించలేదని, పరస్పర బదిలీల విషయంలో చొరవ చూప లేదని విమర్శిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత ఉమ్మడిగా ఉన్న ఆస్తుల విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని మండిపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో జగన్ కెసిఆర్ తో స్నేహం విషయంలో ఆలోచనలో పడ్డారు.
ఈ సమయంలోనే కెసిఆర్ కు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఏపీలో సంచలనంగా మారింది.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని లేఖలో కోరారు. అంతర్రాష్ట్ర బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని కేసీఆర్‌ను జగన్ కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని వైఎస్ జగన్‌ తన లేఖలో కోరారు. మరి తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ రాసిన లేఖ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *