ఆర్టీసీ లేకపోతే కేసీఆర్ సీఎం అయ్యేవారా?

KCR Became CM Due To RTC Only

చరిత్రలో మరుపురాని సంఘటన గురించి ఆర్మీసీ కార్మికులంతా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ రెండోసారి పాలన కొనసాగిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేసీఆర్ తెలంగాణా ఉద్యమం చేయడానికి, సీఎం అవడానికి పరోక్షంగా ఆర్టీసీ కూడా ఒక కారణమేనని చాలామందికి తెలియదు. ఇది అర్థం కావాలంటే మనమంతా 1996-1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోకి వెళ్లాలి. మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎంగా గద్దెనెక్కిన చంద్రబాబు హయంలో రవాణా శాఖ మంత్రి మన ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆరే. అప్పట్లో చంద్రబాబు డైనమిక్ సీఎంగా కాస్త భిన్నంగా పాలన కొనసాగించారు. జవాబుదారీతనం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు. ఈ క్రమంలో ఆయన ఒకసారి రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కార్యాలయానికి వెళ్లారు.  ఇప్పటిలానే అప్పుడు కూడా మన కేసీఆర్ గారు నవాబుగిరీ వెలిగిస్తూ, ఆఫీసుకి పోకుండా ఉండటంతో గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు పడి ఉండేవట ఆయన ఛాంబర్లో. ఆకస్మిక తనిఖీకి వెళ్లిన చంద్రబాబు ఆ ఫైళ్ల గుట్టలన్నీ చూసి ఈయన మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫోటోతో సహా ఆ వార్త పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది కూడా.

ఆ తర్వాత 1999లో సాధారణ ఎన్నికలొచ్చాయి. ఈ లోపు వెలమ సామాజిక వర్గం నుంచి సీబీఐ మాజీ అధిపత విజయరామారావు పి.జనార్దన్ రెడ్డిపై పోటీ చేసి గెలుపొందాడు. కేసీఆర్ ఎలాగూ పని చేయకుండా టైమ్ చేస్తున్నాడని, చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుండా విజయరామారావును మంత్రి చేసి, కేసీఆర్ ను డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టాడు. అప్పుడు చంద్రబాబు కులం ప్రాతిపదికన విజయరామారావుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు పార్టీ సమావేశాల్లో ప్రకటించినట్లు సమాచారం. అయితే, అప్పట్నుంచి కూడా కేసీఆర్ సమర్ధుడైన స్ట్రాటజిస్టే కానీ సమర్ధుడైన పని మంతుడు కాదు. అలా మంత్రిపదవి పోయి, డిప్యూటీ స్పీకర్‌గా ఉండలేక బయటికొచ్చి తెలంగాణా ఉద్యమం కేసీఆర్ ఎత్తుకున్నాడు. కాబట్టి, తప్పందా రవాణా శాఖదేనని ప్రస్తుతం ఆర్టీసీ సీనియర్ ఉద్యోగులు, ఆఫీసర్లు సమ్మె మధ్యలో ఈ చరిత్ర గురించి మాట్లాడుకోవడం విశేషం.

cm kcr history

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *