ఏ అధికారం సీఎం కేసీఆర్ కు లేదు?

kcr doesn’t have removal power

ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరీ పట్ల అఖిలపక్షం భగ్గుమన్నది. బుధవారం ఉదయం ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కార్మికులకు పూర్తి స్థాయిలో సంఘీభావం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకూ సాయం చేస్తామని తెలియజేసింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడారు. న్యాయమైన కోరికలు తీరితేనే అసలైన పండగ.. పండగ పేరుతో కార్మికుల పై వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం కేసీఆర్ చేశారని ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. ఆర్టీసీ సమ్మె న్యాయమైనదని.. ఒకేసారి ఇంతమందిని తీసివేసే అధికారం ముఖ్యమంత్రి కి లేదన్నారు. అయినా, కేసీఆర్ తీసుకున్న సగం నిర్ణయాలను కోర్టు కొట్టి వేసిందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ లాభాలను తెచ్చే సంస్థ కాదని, ప్రజలకు ఉపయోగపడేదన్నారు. కొన్ని రూట్లలో
నష్టాలొచ్చినా ప్రభుత్వం సంస్థను నడిపించాల్సిందేనని చెప్పారు. కార్మికులకు అవసరమైన న్యాయ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ లో ధర్నాలు ఉండవని చెప్పిన కేసీఆర్.. ధర్నా చౌక్ నే ఎత్తేసిన ఘనచరిత్ర గల వ్యక్తిగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకమనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

జగన్ చూసి కేసీఆర్ నేర్చుకోవాలి..
ఆర్టీసీ సమ్మె మొదటి రోజు నుంచే ఎమ్మార్పీఎస్ మద్దతు ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు.  ఆర్టీసీ డిమాండ్లు పూర్తి అయ్యేవరకు తమ మద్దతు ఉంటుందన్నారు. కేసీఆర్ మొదటి రోజు నుంచి మాటమీద నిలబడడనేది మళ్ళీ రుజువు అయిందన్నారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు అన్ని న్యాయబద్ధమైనవని, ఆర్టీసీని ప్రభుత్వం విలీనంలో చేసే వరకు పోరాటం కొనసాగించాలని హితువు పలికారు. కేసీఆర్ దీక్ష విరమించే సమయంలో ఎమ్మార్పీఎస్, జయశంకర్ తప్ప ఎవరూ లేరని గుర్తు చేశారు. పక్క రాష్ట్రం సీఎం జగన్ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని హితువు పలికారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందంటే ప్రభుత్వం వైఫల్యమేనని చెప్పుకొచ్చారు. ఆర్టీసీలో ప్రైవేట్ వాహనాలు తిరగడం వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేట్ చేసి వారికి అనుకూలమైన వ్యక్తులకు అప్పగించేందుకు కేసీఆర్ కుట్ర జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ పోకడ నిర్ణయాల వల్ల ప్రభుత్వం వైఫల్యం చెందుతుందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకు పోతే గత చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందన్నారు.

Telangana RTC Strike Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *