సాగర్ లో కేసీఆర్ చిత్రం తొలగింపు ..

KCR IMAGE REMOVAL IN SAGAR

కేసీఆర్  పాలనలోనే కాదు  తెలంగాణ రాష్ట్రమంతటా తన మార్క్ ఎప్పటికీ వుండాలని భావిస్తున్నట్టు  కనిపిస్తోంది. అందుకే ఆయన తన చిత్రాలను చెక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది .  తన ‘వ్యక్తిగత’ ఇమేజ్ అన్నింట్లో కనిపించాలని కేసీఆర్ భావించటంతోనే అనవసరంగా విమర్శల పాలయ్యారు. యాదాద్రి ఆలయంతో పాటు ఆధునిక దేవాలయంగా అభివర్ణించే నాగార్జున సాగర్‌లో కూడా తన శిల్పాన్ని చెక్కించుకున్నారు.
ఇక యాదాద్రిలో చిత్రాల విషయంలో రచ్చ కొనసాగటంతో అక్కడ చిత్రాలను తొలగించిన  తెలంగాణా సర్కార్ అక్కడ చిత్రాలను  చెక్కటంలో  తమ పాత్ర ఏమీ లేదని , శిల్పి అభిమానంతో చెక్కారని చెప్పారు. ఇక తాజాగా ఆలస్యంగా నాగార్జున సాగర్ లో బుద్ధ వనంలో మహా స్తూపంపై సీఎం కేసీఆర్‌ చిత్రం చిత్రించారు. ఇక అందులో  బుద్ధుడికి కేసీఆర్‌ పుష్పాంజలి ఘటిస్తున్నట్టుగా దీన్ని మలిచారు. యాదాద్రిలో బొమ్మల వ్యవహారం వివాదంగా మారడంతో నాగార్జునసాగర్‌లో వుంచిన ఈ శిల్పాన్ని అప్పటికప్పుడు తొలగించారు. గుట్టు చప్పుడు కాకుండా సాగర్ లోని చిత్రాన్ని తొలగించిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరి మీద తప్పును రుద్ధనున్నారో అని చర్చ జరుగుతుంది. అక్కడ స్థూపంపై కేసీఆర్ చిత్రం ప్రభుత్వ యంత్రాంగానికి తెలీకుండానే జరిగిందా .. అది కూడా ఎవరైనా శిల్పి అభిమానంతో చెక్కిన చిత్రం అని చెబుతారా అన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ .

WHO’S IMAGES REMOVE IN SAGAR

tags :  Nagarajuna sagar , buddha vanam, maha sthoopa , kcr, sculptors, yadadri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *