తిరుమలలో కేసీఆర్ కి గ్రాండ్ వెల్కమ్

KCR IN TIRUMALA

  • పర్యటన ఆద్యంతం సకల సౌకర్యాలు
  • ఘనంగా అతిథి మర్యాదలు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
  • చెవిరెడ్డి ఆతిథ్యం స్వీకరించిన తెలంగాణ సీం

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు రెండు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొక్కు చెల్లించుకోవడం కోసం ఓసారి, తాజాగా ఎన్నికలు పూర్తయి రెండో సారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత రెండో సారి ఆయన ఆ కలియుగ వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అయితే, అప్పటికీ, ఇప్పటికీ ఎంతో వైవిధ్యం స్పష్టంగా కనిపించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడమే ఇందుకు కారణం. గతంలో కేసీఆర్ తిరుమల వచ్చినప్పుడు తెలుగుదేశం నేతలు మామూలుగా ఆయనకు స్వాగత సత్కారాలు చేసి, దర్శనం తదితరాలు చేయించి పంపించారు. ఇందుకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు అధికారులే ఎక్కువగా చూసుకున్నారు. తాజాగా పరిస్థితి మారింది. ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయ మిత్రుడిగా ఉన్న కేసీఆర్.. తిరుమలకు రావడంతో వైఎస్సార్ సీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలో కేసీఆర్ అడుగు పెట్టింది మొదలు.. తిరిగి ఆయన విమానం ఎక్కేవరకు అన్నీ తామే చూసుకున్నారు. ముఖ్యంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కేసీఆర్ పర్యటన ఆద్యంతం ఆయన వెన్నంటే ఉన్నారు. కేసీఆర్ సైతం తనకు లభించిన అతిథి మర్యాదల పట్ట సంతృప్తి చెందారు. ఇక అన్ని ఆలయాల దర్శనాలు పూర్తయిన తర్వాత హైదరాబాద్ వెళ్లే ముందు చెవిరెడ్డి కోరిక మేరకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో కేసీఆర్ తదితరులకు వైఎస్సార్ సీపీ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు.

AP NEWS

Related posts:

ఐటీ మహిళకొచ్చిన కష్టం పగవాడికీ రావొద్దు
అలరించిన కుమారి రమ్యా భరతనాట్యం
వీడు తండ్రా? కాదు మానవమృగం..
తొమ్మిదోతరగతి బాలిక అత్యాచారం
నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలట
పార్లమెంట్ ఎన్నికల బరిలో నేషనల్ ఉమెన్స్ పార్టీ
బలవంతంగా తాళి కట్టి ఆపై చిత్రహింసలు పెట్టిన ఘనుడు
మహిళలకు 33 శాతం సీట్లిస్తామని ప్రకటించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్ద పీట వేసిన తెలంగాణా సర్కార్
మహిళా ఉద్యోగులకు సెలవు
  మహిళా ఉద్యోగులపై రక్షణా శాఖ కీలక నిర్ణయం
శబరిమలలో మహిళల ప్రవేశంపై ట్రావెన్ కోర్ బోర్డు షాకింగ్ నిర్ణయం
భానుప్రియ ఇంట్లో మరో ముగ్గురు మైనర్లు
మహిళా రిజర్వేషన్ బిల్లు మాటేంటి అంటున్న ఎంపీ కవిత
శబరిమల వివాదం స‌ద్దుమ‌ణిగేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *