కేసీఆర్ జగన్ ను , ఫడ్నవీస్ ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తుంది అందుకేనా

Spread the love

Kcr Invited Jagan and Fernandez for Kaleswaram Project

మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటి అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా విద్యాసాగర్‌తో మర్యాద పూర్వకంగా భేటి అయిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి వివాదాలు రాకుండా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటి అయ్యారు. ఈ నెల 21 ప్రారంభించబోయే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ఆహ్వానించారు. దీంతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేయజేశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకి చేరుకున్న కేసీఆర్ తొలుత గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటి అయ్యారు. రాజ్‌భవన్ లో గవర్నర్ తో మర్యాద పూర్వకంగా భేటి అయిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట పాటు గవర్నర్‌తో భేటి అయి వివిధ అంశాలపై కేసీఆర్ చర్చించారు.

ఇక ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా కేసీఆర్ ఆహ్వానించాలని అనుకుంటున్నారు. ముఖ్య అతిధిగా జగన్ ను పిలవాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్ ను ఆహ్వానించనున్నారు. అయితే కేసీఆర్ పక్క రాష్ట్రాలతో సత్సబందాలు నేరపాలనే ఉద్దేశం తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు అంటే అగ్గి మీద గుగ్గిలం అయ్యే కేసీఆర్ దేశంలోని ఇతర రాష్ట్రాల నేతలతో ఇప్పటి నుండే సత్సంబంధాలు కొనసాగిస్తే అది చంద్రబాబుకు చెక్ పెట్టినట్టు అవుతుంది. అలాగే భవిష్యత్ రాజకీయాల్లో కేంద్రంలో చక్రం తప్పటం సునాయాసం అవుతుంది అన్న భావన ఉంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్నేహ పూర్వక సంబంధాల కోసం స్వయంగా ఆయనే స్నేహహస్తం చాస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *