కేసీఆర్ గోడమీద పిల్లి అన్న బండారు దత్తాత్రేయ

KCR IS CAT ON THE WALL

తెలంగాణముఖ్యమంత్రి కెసిఆర్ మీద బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం అనేది అసాధ్యమని తెలిసినప్పటికీ కూడా కెసిఆర్ అందుకు వ్యతిరేకంగా వేగంగా పావులు కదుపుతున్నారని బండారు దత్తాత్రేయ అన్నారు… ఢిల్లీలో జాతీయ మీడియా తో మాట్లాడిన ఆయన కెసిఆర్ మీద ఇప్పటికే ప్రజల్లో నమ్మకం పోయిందని, ప్రజలతో పాటే నాయకులూ ఎవరు కూడా కెసిఆర్ ని నమ్మే పరిస్థితిలో లేరని, ఆయన గోడ మీద పిల్లిలాంటి వారని దత్తాత్రేయ తీవ్రంగా విమర్శించారు.
కాగా ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో మళ్ళీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని దత్తాత్రేయ అన్నారు. అయితే మనదేశములోని పార్టీల అన్ని కూడా కాంగ్రెస్ కి గాని, బీజేపీ కి గాని మద్దతిస్తామని, కానీ కెసిఆర్ అనవసరంగా బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు చేయాలనీ చూడటం నిజంగా తెలివితక్కువ పని అని దత్తత్రేయ అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ ఒక అవకాశ వాదని, ఆయనను ఎవరూ కూడా నమ్మరు అని దత్తాత్రేయ తీవ్ర విమర్శలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *