కేసీఆర్ ను ఫామ్ హౌస్ పంపిస్తారా?

19
bandi sanjay

kcr rest in farmhouse?

త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపిస్తామని రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ  ఇవాళ (శుక్రవారం) అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి మద్దతుగా బీజేపీ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. నాంపల్లి, బషీర్ బాగ్, పోలీస్ కంట్రోల్ రూం ముందు పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నాయకులను ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. సీఎం కేసీ ఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.  బండి సంజయ్ తో పాటు బీజీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తరపున బీజేపీ, నిజాం, రాజాకార్ల తరపున కేసీఆర్ ఉన్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here