ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై సీఎం సమీక్ష

Kcr Review Meeting On RTC Routes To Private

ముఖ్యమంత్రి కేసీఆర్  మరోసారి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీపై ఆయన చకచకా పావులు కదుపుతున్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను గురువారం జరగనున్న రాష్ట్ర కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . రాష్ట్ర హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర ఆర్టీసీ కార్మికులపై ఎలాంటి సానుకూల దృక్పధాన్ని ప్రదర్శించటం లేదని తెలుస్తుంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ చెయ్యటం ,ఇంకా అవసరం అయితే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఉద్వాసన పలకటం వంటి నిర్ణయాలపై తప్ప ఆర్టీసీ కార్మికులను ఆడుకునే ఆలోచన ఆయనకు లేదని తెలుస్తుంది. ఇప్పటికి ఎన్ని సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించినా ఆర్టీసీ కార్మికుల గురించి కించిత్ అయినా మాట్లాడకపోవటం ఆయనకు కార్మికుల పట్ల ఉన్న వ్యతిరేకతకు అడ్డం పడుతుంది.
52 కార్మికులు సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ వారిని ఉద్యోగాల్లోకి తీసుకోటానికి ససేమిరా అన్నారు.. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయినా సీఎం కేసీఆర్ తాను చెయ్యాలనుకున్నది మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నారు .

Kcr Review Meeting On RTC Routes To Private,rtc strike, ts rtc strike, rtc workers,  telangana government,cm kcr, review, pragathi bhavan, puvvada ajay kumar, minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *