కేసీఆర్ పప్పులు తమిళనాట ఉడకలేదన్న విజయశాంతి

Spread the love

KCR Tamilnadu trip flop says Vijayasanthi

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడుతున్నటువంటి డ్రామాకి తెరపడిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని రాజకీయాలు చేస్తున్నటువంటి కెసిఆర్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళ నేతలే అంటున్నారని విజయశాంతి అన్నారు. కాగా ఇటీవల కెసిఆర్, డీఎంకే నేత నేత స్టాలిన్ తో చర్చలు జరిపిన నేపధ్యంలోనే విజయశాంతి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు . కాగా స్టాలిన్ చెప్పినటువంటి మాటలకు కెసిఆర్ ఒక్కసారిగా కుచించుకుపోయారని, విజయశాంతి అన్నారు. అంతేకాకుండా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని కలలు కన్నటువంటి కెసిఆర్ కి నిరాశే మిగిలిందని విజాశాంతి ఎద్దేవా చేశారు. ఈమేరకు విజయ శాంతి పేరిట నిర్వహిస్తోన్న ఫేస్‌బుక్ పేజీల్లో సుదీర్ఘమైన ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.

“ఇన్ని రోజులు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో..సారు, కారు, సర్కారు అంటూ మాట్లాడిన వారి నోట.. డామిట్ కథ అడ్డం తిరిగింది” అనే డైలాగ్ వినిపిస్తోందన్నారామె. ‘‘వైసీపీ అధినేత జగన్‌ను బుట్టలో వేసుకున్న విధంగానే, స్టాలిన్‌ను కూడా బురిడీ కొట్టించాలని కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రదర్శించారు. కానీ ఆ పప్పులు తమిళనాట ఉడకలేదు. ఎందుకంటే తన తండ్రి కరుణానిధి నాయకత్వంలో కేసీఆర్ లాంటి ఎంతో మంది మాయగాళ్లను చూసిన అనుభవం స్టాలిన్‌కు ఉంది. అందుకే ఈ గిమ్మిక్కులను తిప్పికొట్టి, స్టాలిన్ తన చాణక్యనీతిని ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేలోనే డీఎంకే కొనసాగుతుందని చెప్పి, టీఆర్ఎస్ ఛీప్ ట్రిక్స్‌కు చెక్ పెట్టార’’ని విజయశాంతి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *