డిజిటల్ క్వీన్ గా మారిన కీర్తి సురేష్

4
keerthi suresh update
keerthi suresh update

keerthi as digital queen

కాలం కలిసి రానప్పుడు ఓవర్ ద టాప్ ఆలోచించాలి అంటారు. అదే ఇప్పుడు సినిమా వారికి దిక్కయ్యింది. ఒకవైపు కరోనా విజృంభిస్తుండటంతో ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ కావు అనేది క్లియర్ గా తేలిపోయింది. దీంతో చాలా సినిమాలు ఓటిటి(ఓవర్ ద టాప్) వైపు వెళుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విడుదలవుతున్నాయి. ఈ లిస్ట్ లో సౌత్ నుంచి చాలా స్పీడ్ గా ఉన్న బ్యూటీ మహానటి కీర్తి సురేష్. మహానటి తో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి ఆ తర్వాత ఫీమేల్ ఓరియంటెడ్ కథలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అఫ్ కోర్స్ రెగ్యులర్ హీరోయిన్ కైనా ఓకే. కానీ తను ఊహించిన ఆఫర్స్ మాత్రం రావడం లేదు. అందుకే తనే ప్రధానంగా ఉన్న కథలను ఎంచుకుంటోంది. అలా తను చేసిన పెంగ్విన్ సినిమా ఆల్రెడీ ఓటిటిలో విడుదలైంది. ఈ సినిమా కోసం తను ఎంతో కష్టపడింది. ఆరేళ్ల పిల్లాడి తల్లిగా.. గర్భిణిగా, భర్త వెళ్లిపోతే మరో వ్యక్తిని పెళ్లి చేసుకునే అమ్మాయిగా ఓ రకంగా సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. కానీ తన కష్టానికి అస్సలే మాత్రం ఫలితం రాలేదు.

పెంగ్విన్ సౌత్ లో తొలి డిజిటల్ మూవీగా విడుదలైతే.. ఫస్ట్ మూవీనే డిజాస్టర్ అనిపించుకుంది. ఇక స్టార్ హీరోల సినిమాలకే ఇప్పుడు దిక్కులేదు. అందుకే తన సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యేంత వరకూ ఉండటం కష్టం అని అందరికీ తెలిసింది. దీంతో ఆమె నటించిన ఇతర మూవీస్ ను కూడా ఓటిటిలోనే విడుదల చేయబోతున్నారు మేకర్స్. అందులో మొదటగా వస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి, తర్వాత మిస్ ఇండియా. ఈ రెండు సినిమాలను కూడా ఓటిటిలోనే విడుదల చేయాలనుకుంటున్నారట. ఇదే జరిగితే ఫ్యూచర్ లో కీర్తి సురేష్ మూవీస్ కు థియేటర్స్ లో పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అయినా ఫర్వాలేదనుకుని అమ్మడు దూసుకుపోతే తను డిజిటల్ క్వీన్ గా మారుతుంది. అంటే తనతో సినిమాలు చేసే వారు ముందే ఓటిటికి ఫిక్స్ అయి ఉంటారు. థియేటర బిజినెస్ లు అదనంగా భావించే రంగంలోకి దిగుతారు. మొత్తంగా కీర్తి సురేష్ ను మనవాళ్లు డిజిటల్ క్వీన్ నే చేసేలా ఉన్నారు.

tollywood news